SBI Alert: ఇటీవలి కాలంలో SBI పేరిట నకిలీ WhatsApp మెసేజ్‌లు, APK ఫైళ్ల రూపంలో మోసాలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. కేవైసీ (KYC) అప్‌డేట్, రివార్డ్ పాయింట్లు, బోనస్‌లు అనే పేరుతో సైబర్ నేరగాళ్లు పంపే అపరిచిత ఫైళ్లను క్లిక్ చేస్తే వ్యక్తిగత డేటా, బ్యాంకింగ్ సమాచారం, ఓటీపీలు పూర్తిగా నేరగాళ్ల చేతుల్లోకి చేరే ప్రమాదం ఉందని SBI స్పష్టం చేసింది. బ్యాంక్ స్పష్టం చేసిన ముఖ్య విషయం – SBI ఏ పరిస్థితుల్లోనూ APK ఫైల్, డౌన్‌లోడ్ లింక్, లేదా అసాధారణ URLలను కస్టమర్లకు పంపదు. మీకు అలాంటి మెసేజ్ వస్తే అది 100% మోసం అని గుర్తించాలని SBI హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు వినియోగదారుల ఫోన్‌లో మాల్వేర్ ఇన్‌స్టాల్ చేయడం, బ్యాంక్ లాగిన్ వివరాలు దోచుకోవడం, UPI యాప్స్‌ను కంట్రోల్ చేయడం వంటి పనులు చేస్తారు. కాబట్టి ఏ అన్‌నోన్ APKని ఓపెన్ చేయడం తీవ్ర ప్రమాదకరం.
Read also: Telangana Global Summit : గ్లోబల్ సమ్మిట్ కు ప్రధాని మోడీ ని ఆహ్వానించాలి – సీఎం రేవంత్

అప్రమత్తతే రక్షణ – SBI జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలు
SBI Alert: SBI వినియోగదారులు తప్పక పాటించాల్సిన సూచనలు:
- అపరిచిత APK ఫైళ్లు, లింకులు, QR కోడ్స్‌ను ఎప్పుడూ క్లిక్ చేయకండి.
- KYC అప్డేట్ పేరుతో వచ్చే మెసేజ్‌లను నమ్మే ముందు SBI అధికారిక వెబ్‌సైట్ లేదా బ్రాంచ్‌లో ధృవీకరించండి.
- WhatsApp, SMS, సోషల్ మీడియా ద్వారా పంపిన అధికారికత లేని లింకులను పూర్తిగా నిర్లక్ష్యం చేయండి.
- ఫోన్‌లో అకస్మాత్తుగా స్లో అయ్యే లక్షణాలు, అనుమానాస్పద యాప్స్ కనిపిస్తే వెంటనే యాప్స్ తొలగించండి లేదా సెక్యూరిటీ స్కాన్ చేయండి.
- ఏదైనా మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి రిపోర్ట్ చేయాలని SBI కోరింది.
ఈ సూచనలను పాటించడం ద్వారా వినియోగదారులు బ్యాంక్ ఖాతాలు, ఫొన్ సెక్యూరిటీ, వ్యక్తిగత సమాచారం అన్నీ సురక్షితంగా ఉండేలా చూసుకోవచ్చు.
SBI APK ఫైళ్లు పంపుతుందా?
లేదు, SBI ఎప్పుడూ APK ఫైల్స్‌ను పంపదు.
KYC అప్‌డేట్ SMS నమ్మాలా?
కాదు. ఇది ఎక్కువగా మోసపు ప్రయత్నమే. అధికారిక బ్యాంక్ ఛానల్స్‌లో మాత్రమే KYC చేయండి.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/