హైదరాబాద్ (తార్నాక): దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సోమవారం సికింద్రాబాద్ (Secunderabad)లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్, ప్రధాన విభాగాధిపతులతో కలిసి జోన్ వ్యాప్తంగా రైలు కార్యకలాపాల భద్రతపై వివరణాత్మక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్ల మొత్తం ఆరు డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు (డి.ఆర్. ఎంలు) విడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ప్రయాణీకుల, శాఖాపరమైన భద్రతను నిర్ధారించడానికి భద్రతా విధానాలు, భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించడం ప్రాముఖ్యత గురించి వివరించారు.
గేట్ల వద్ద అనధికార వాహనాల కదలిక పై కఠినమైన చర్యలు
ఏదైనా భద్రతా కార్యకలాపాలు చేపట్టేటప్పుడు రైల్వే బోర్డు (Railway Board)మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆయన అధికారులను ఆదేశించారు. లెవల్ క్రాసింగ్లు, గేట్ల వద్ద అనధికార వాహనాల కదలిక పై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్టేషన్లలో బ్యాటరీ ఆపరేటెడ్ కార్ల (బి.ఓ.సిలు) నిర్వహణ, క్యాంపింగ్ కోచ్లను సరిగ్గా స్థిరపరచడం మరియు రిలే గదులలో పూర్తి ఇంటర్ లాకింగ్ ప్లాన్ల నిర్వహణ కోసం భద్రతా సూచనలను పాటించాల్సిన అవసరా లపై ఆయన దృష్టి సారించారు. జనరల్ మేనేజర్ జోన్ వ్యాప్తంగా కొనసాగుతున్న భద్రతా కార్యక్రమాలను సమీక్షిస్తూ, ఇంజనీరింగ్, సిగ్నల్, టెలికమ్యూనికేషన్స్, మెకానికల్, ఎలక్ట్రికల్ వంటి వివిధ విభాగాలు చేపట్టిన పరిశీలించారు. పశువుల రన్ ఓవర్ కేసులను పర్యవేక్షించడం, ప్రైవేట్ సైడింగ్లలో సి.సి.టి.వి ఏర్పాటు, సరుకు రవాణా రైలు కార్యకలాపాలలో భద్రతా చర్యలు వంటి ముఖ్యమైన రంగాలను ఆయన పరిశీలించారు.
తనిఖీల సమయంలో గుర్తించిన ఏవైనా లోపాలను సజావుగా రైలు కార్యకలాపాలను నిర్వర్తించడానికి వెంటనే చొరవలను సరిదిద్దాలని ఆయన నొక్కి చెప్పారు. సంజయ్ కుమార్ శ్రీవాస్తవ భద్రతా ప్రమాణాలను పెంపొందించడంపై వ్యూహాత్మక ప్రాధాన్యతనిచ్చారు. పర్యవేక్షకులు క్షేత్రస్థాయి కార్యకలాపాలను నిశితంగా పర్యవేక్షించాలని సూచించారు. సమస్యలను సకాలంలో పరిష్కారాన్ని నిర్ధారించాలని ఆదేశించారు. అదేవిదంగా భద్రతా కేటగిరీ సిబ్బందికి రిఫ్రెషర్ కోర్సులు, కుటుంబ కౌన్సెలింగ్ సెషన్ల ద్వారా శిక్షణ, సున్నితత్వాన్ని పెంపొందించడంతో జోన్ వ్యాప్తంగా భద్రతా సంస్కృతిని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
Read hindi news:hindi.vaartha.com
Read also: