📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్

మహా కుంభమేళ నీటి విక్రయం -భారీగా లాభాలు

Author Icon By Vanipushpa
Updated: February 24, 2025 • 12:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బ్లింకిట్, బిగ్‌బాస్కెట్, అమెజాన్ వంటి చాల ఈ-కామర్స్ కంపెనీలు మహా కుంభ జలాలను(water) ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నాయి. దీనిపై భారీ లాభాలు కూడా ఆర్జిస్తున్నాయి. ఈ మహా కుంభమేళా పవిత్ర జలాన్ని ఆన్‌లైన్‌లో అమ్మడంపై షీల్డ్-ఇండియా వ్యవస్థాపకుడు నమన్‌బీర్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లింకిట్ ‘మహాకుంభ సంగం గంగా జల్’ ను రూ.69కి అమ్మడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. దీని ప్రామాణికత, ధరపై కూడా నమన్‌బీర్ సింగ్ విమర్శలు కురిపించారు. మతపరమైన భావాలను వ్యాపారం చేయడంపై కూడా ఆయన చర్చను లేవనెత్తారు.
ఈ నీటిపై పలు అనుమానాలు
నమన్‌బీర్ సింగ్ లింక్డ్ఇన్ పోస్ట్‌లో ‘సంగం వాటర్ లేదా తెలివైన మార్కెటింగ్?’ పేర్కొన్నారు. బ్లింకిట్ అమ్ముతున్న గంగా జలాల ప్రామాణికతపై ఆయన ప్రశ్నలు కురిపించారు. ఈ నీరు వాస్తవానికి మహాకుంభ సంగం నుండి వచ్చిందో లేదో ఖచ్చితం చేయడం కష్టమని అన్నారు. ‘ఈ నీరు నిజమైన సంగం నుండి వచ్చిందా లేదా నిరూపించడానికి నా దగ్గర సమాధానం లేదు’ అని సింగ్ రాశారు. నీటిలో కొద్దిగా నిజమైన గంగా జలాన్ని కలపడం ద్వారా సాధారణ నీటిని స్వచ్ఛమైనదిగా ఎలా అమ్ముతారో వెల్లడించారు. సంగం నీటి విషయంలో కూడా అదే జరుగుతుందని అన్నారు.


బ్లింకిట్ సంగమ్ జల్ 100 మి.లీ. రూ. 99
‘సంగం నీటిని తీసుకురావడానికి అయ్యే ఖర్చు దాదాపు సున్నా, ఎందుకంటే ఎవరైనా దానిని చిన్న సీసాలో తీసుకురావచ్చు’ అని సింగ్ అన్నారు. మొత్తం ఉత్పత్తికి నిజమైన నీటి బాటిల్‌ను జోడిస్తే లాభం చాలా ఎక్కువగా ఉంటుందని కూడా తెలిపారు. ఒక లీటరు బిస్లరీ బాటిల్ ధర 20 రూపాయలు. అదే సమయంలో బ్లింకిట్ సంగమ్ జల్ 100 మి.లీ. రూ. 99కి లభిస్తుంది. బ్లింకిట్‌ను లక్ష మంది భక్తులకు విక్రయిస్తే దాదాపు కోటి రూపాయలు సంపాదించవచ్చని అంచనా వేశారు. “ఇది పూర్తిగా ’15 దిన్ మే పైసా డబుల్ స్కీమ్'” అంటూ చమత్కరించాడు. సంగం గంగా జలాలను ఎంత ధరకు అమ్ముతున్నారు ? ఈ వివాదం ఉన్నప్పటికీ, అనేక పెద్ద ఈ-కామర్స్ కంపెనీలు ఈ వ్యాపారంలోకి దూకాయి.
రూ.121కి మట్టి
బ్లింకిట్ ‘మహాకుంభ సంగమ గంగాజలం’ను రూ. 69కి అందిస్తోంది. ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాలో 100 చదరపు అడుగుల స్టోర్ కూడా ప్రారంభించింది. బిగ్‌బాస్కెట్ ‘స్వస్తి మహాకుంభ్ పవిత్ర త్రివేణి సంగమ జల్’ను ప్రారంభించింది, ఇది గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం నుండి నేరుగా నీటిని తీసుకురావడానికి హామీ ఇస్తుంది. అమెజాన్ పవిత్ర స్థలం నుండి ‘మహాకుంభ – త్రివేణి నీరు (100 మి.లీ.) + మట్టి’ని రూ.121కి విక్రయిస్తోంది. అతని పోస్ట్ నమ్మకం, వ్యాపారంపై పెద్ద చర్చకు దారితీసింది. ఈ కంపెనీలు ఆధ్యాత్మిక అనుభవాలను మరింత అందుబాటులోకి తెస్తున్నాయని వాదిస్తున్నారు. కానీ కొంతమంది మతపరమైన భావాల నుండి లాభం పొందడంలోని నైతికతను ప్రశ్నిస్తున్నారు.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu huge profits Latest News in Telugu Paper Telugu News Sale of Maha Kumbh Mela water Telugu News online Telugu News Paper Telugu News Today uttara pradesh

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.