📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Saif Ali Khan: సైఫ్‌ కు చేజారిన రూ.15 వేల కోట్ల ఆస్తులు

Author Icon By Vanipushpa
Updated: July 5, 2025 • 4:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇదేబాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌‌ (Saif Ali Khan)కు మధ్యప్రదేశ్‌ హైకోర్టు (Madhya Pradesh High Court)లో గట్టి షాక్‌ తగిలింది. మధ్యప్రదేశ్‌లోని తన పూర్వీకుల ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగా ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సైఫ్ అలీఖాన్ సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. సైఫ్‌ కుటుంబానికి చెందిన రూ.15,000 కోట్ల ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీగా నిర్ణయిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఈ విషయంపై మరోసారి విచారణ జరపాలని, ఏడాదిలోగా తుది నిర్ణయం తీసుకోవాలని ట్రయల్‌ కోర్టును ఆదేశించింది. దీంతో సైఫ్‌ ఆస్తుల యాజమాన్య హక్కులపై సందిగ్ధం నెలకొంది.
భోపాల్‌లో సైఫ్‌ కుటుంబానికి అతడి నాన్నమ్మ సాజిదా సుల్తాన్‌ నుంచి పలు రాజభవనాలు వారసత్వంగా వచ్చాయి. భోపాల్‌ చివరి నవాబు హమీదుల్లా ఖాన్‌ కుమార్తె సాజిదా. ఆయన పెద్ద కుమార్తె అబీదా సుల్తాన్‌ దేశ విభజన నేపథ్యంలో 1950లో పాకిస్థాన్‌కు వలస వెళ్లారు. సాజిదా ఇక్కడే నివసిస్తూ పటౌడీ నవాబు అయిన ఇఫ్తిఖర్‌ అలీఖాన్‌ ను పెళ్లాడారు. సాజిదాకు ఆమె తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తులు కాలక్రమంలో ఆమె వారసులైన సైఫ్‌ కుటుంబానికి దక్కాయి.

Saif Ali Khan: సైఫ్‌ కు చేజారిన రూ.15 వేల కోట్ల ఆస్తులు

పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
అయితే హమీదుల్లాకు చట్టబద్ధ వారసురాలు అబీదా మాత్రమే అని, ఆమె పాక్‌కు వలస వెళ్లినందువల్ల ఎనిమీ యాక్ట్‌ ప్రకారం ఆ ఆస్తులను కాందిశీకుల ఆస్తులుగా గుర్తిస్తున్నట్లు కస్టోడియన్‌ ఆఫ్‌ ఎనిమీ ప్రాపర్టీ కార్యాలయం 2015లో ప్రకటించింది. దీన్ని సవాలు చేస్తూ సైఫ్‌ కుటుంబసభ్యులు మధ్యప్రదేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేస్తూ పలు కీలక ఆదేశాలిచ్చింది.
తాజా ఆదేశాలు జారీ
ఈ వివాదం 2014లో మొదలైంది. కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ డిపార్ట్‌మెంట్ నోటీసు నుండి వచ్చింది.. ఇది పటౌడి కుటుంబ ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీ చట్టం పరిధిలోకి తీసుకువచ్చింది.. వాటిని విదేశీ పౌరుడి ఆస్తులుగా.. ప్రభుత్వ నియంత్రణకు లోబడి ఉంటుందని ప్రకటించింది. ఇటీవలి పరిణామాలలో, మధ్యప్రదేశ్ హిఫ్ కోర్టు స్థానిక ట్రయల్ కోర్టు 25 ఏళ్ల నాటి తీర్పును రద్దు చేసి, కేసును పూర్తిగా తిరిగి విచారించాలని ఆదేశించింది. కోర్టు తాజా ఆదేశం ప్రకారం ఈ విషయాన్ని ప్రారంభం నుండి పునఃపరిశీలించాలని, ట్రయల్ కోర్టుకు ఒక సంవత్సరం లోపు విచారణను ముగించాలని ఆదేశాలు జారీ చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Read also: Pune: పూణే అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్..

#telugu News Ap News in Telugu Bollywood nawab property Bollywood property news Breaking News in Telugu Google News in Telugu Indian royal families Latest News in Telugu Paper Telugu News Pataudi estate news royal property dispute Rs 15000 crore property Saif Ali Khan inheritance Saif Ali Khan net worth Saif Ali Khan property loss Saif royal assets Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.