📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Sachin Pilot: అశోక్ గెహ్లాట్‌తో సచిన్ పైలట్ భేటీ

Author Icon By Anusha
Updated: June 8, 2025 • 12:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాజస్థాన్ లో ఏళ్లుగా తీవ్ర రాజకీయ వైరం కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో శనివారం జైపూర్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీ వారిద్దరి మధ్య నెలకొన్న విభేదాలకు తెరపడి, సయోధ్య కుదిరే అవకాశాలున్నాయనే చర్చకు దారితీసింది.దివంగత కేంద్ర మంత్రి, తన తండ్రి రాజేష్ పైలట్ 25వ వర్ధంతి కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా అశోక్ గెహ్లాట్‌ను సచిన్ పైలట్(Sachin Pilot) వ్యక్తిగతంగా ఆహ్వానించారు. 11న రాజేష్ పైలట్ మాజీ పార్లమెంటరీ నియోజకవర్గమైన దౌసాలో ఈ స్మారక కార్యక్రమం జరగనుంది. 25 ఏళ్ల క్రితం రాజేష్ పైలట్ ఒక రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం, రాజకీయ ఆధిపత్య పోరు నడిచింది. 2020లో రాజస్థాన్ కాంగ్రెస్‌(Rajasthan Congress)లో తలెత్తిన రాజకీయ సంక్షోభం తర్వాత ఇలా బహిరంగంగా కలుసుకోవడం ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో తాజా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

నన్ను ఆహ్వానించారు

ఈ సమావేశం అనంతరం ఇరువురు నేతలు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్ తన నివాసంలో మాజీ కేంద్ర మంత్రి రాజేష్ పైలట్ 25వ వర్ధంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు” అని గెహ్లాట్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. “రాజేష్ పైలట్, నేను 1980లో కలిసి లోక్‌సభలో అడుగుపెట్టాం. దాదాపు 18 ఏళ్లపాటు ఎంపీలుగా పనిచేశాం. ఆయన అకాల మరణం నాకు వ్యక్తిగతంగా, పార్టీకి తీరని లోటు” అని రాజేష్ పైలట్‌తో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గెహ్లాట్ గుర్తు చేసుకున్నారు.

హాజరుకావాలని

సచిన్ పైలట్ కూడా తమ భేటీకి సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ “ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌‌ను కలిశాను. జూన్ 11న దౌసాలో మా నాన్నగారు రాజేష్ పైలట్ 25వ వర్ధంతి సందర్భంగా జరిగే స్మారక కార్యక్రమానికి హాజరుకావాలని వారిని అభ్యర్థించాను” అని పేర్కొన్నారు. రాజేష్ పైలట్(Rajesh pilot) జూన్ 2000లో జైపూర్‌కు సుమారు 50 కిలోమీటర్ల దూరంలోని దౌసా జిల్లా భండానా గ్రామంలో జరిగిన కారు ప్రమాదంలో మరణించారు.

రాజస్థాన్ కాంగ్రెస్

ఈ ఇద్దరు కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు 2018 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించినప్పటి నుంచి మొదలయ్యాయి. అప్పటి రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న పైలట్, రాష్ట్రంలో పార్టీ పునరుజ్జీవనంలో కీలక పాత్ర పోషించారన్న ప్రశంసలు అందుకున్నారు. అయితే, ముఖ్యమంత్రి పదవి మాత్రం అనుభవజ్ఞుడైన అశోక్ గెహ్లాట్‌(Ashok Gehlot)కు మూడోసారి దక్కింది. పైలట్‌కు ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇది తొలిదశలో అసంతృప్తికి బీజం వేసింది.ఈ వైరం 2020 జూలైలో తారస్థాయికి చేరింది. యువ నాయకులను పక్కన పెడుతున్నారని, కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడిగా తన అధికారాన్ని గెహ్లాట్ అణగదొక్కుతున్నారని ఆరోపిస్తూ పైలట్ తన వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలతో కలిసి గెహ్లాట్‌పై తిరుగుబాటు చేశారు.

బహిరంగంగా ఆరోపించారు

దీనికి ప్రతిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పైలట్ బీజేపీతో కుమ్మక్కయ్యారని గెహ్లాట్ బహిరంగంగా ఆరోపించారు. ఆయన్ని ‘నికామా’ (పనికిరానివాడు), ‘నకారా’ (అసమర్థుడు) అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ బహిరంగ విమర్శలు వారి మధ్య అగాధాన్ని మరింత పెంచాయి. అనతికాలంలోనే పైలట్‌ను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి, పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం మధ్యవర్తిత్వం చేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు, ఇరువురి మధ్య నమ్మకం పూర్తిగా దెబ్బతింది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజా భేటీ ఆసక్తికరంగా మారింది.

Read Also: Tension in Manipur : మణిపుర్లో మళ్లీ చెలరేగిన హింస

#BreakingRivalry #CongressReboot #JaipurWatch #SachinPilotAshokGehlot Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.