📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Sports: భారత కొత్త కెప్టెన్ గురించి రవిశాస్త్రి కీలక ప్రకటన

Author Icon By Anusha
Updated: May 17, 2025 • 3:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌ తర్వాత జూన్‌లో భారత్ ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. దీనికి ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. ఈ క్రమంలో టీమిండియాకు ఇప్పుడు కొత్త టెస్ట్ కెప్టెన్ అవసరం. ఈ పర్యటనకు టీమిండియాను ఇంకా ప్రకటించలేదు. కానీ కొత్త కెప్టెన్ గురించి ప్రతిరోజూ ఊహాగానాలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో రోహిత్ శర్మ లేకపోవడంతో జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) టీమిండియాకు నాయకత్వం వహించాడు. అందువల్ల జస్‌ప్రీత్ బుమ్రాను తదుపరి టెస్ట్ కెప్టెన్‌గా పరిగణించారు. ఇప్పుడు టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి జస్‌ప్రీత్ బుమ్రాను కెప్టెన్‌గా చేయకూడదని అభిప్రాయపడ్డారు.ఈ రోజుల్లో టెస్టుల్లో టీమిండియా కొత్త కెప్టెన్ కోసం చాలా చర్చలు జరుగుతున్నాయి. కొందరు శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా చూడాలని కోరుకుంటుండగా మరికొందరు జస్‌ప్రీత్ బుమ్రా రవీంద్ర జడేజా(Ravindra Jadeja)లను కోరుకుంటున్నారు. దీనికి సంబంధించి భారత జట్టు మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఐసీసీ సమీక్షలో మాట్లాడుతూ “జస్‌ప్రీత్ బుమ్రా కెప్టెన్ కావాలని నేను కోరుకోవడం లేదు. కెప్టెన్‌గా చేస్తే అతడిని బౌలర్‌గా కోల్పోతాం. మ్యాచ్‌కు తనను తాను సిద్ధం చేసుకోవాలని భావిస్తున్నాను. గాయం తర్వాత బుమ్రా తిరిగి వస్తున్నాడు. ఐపీఎల్‌లో కేవలం 4 ఓవర్లు బౌలింగ్ చేస్తాడు. టెస్టుల్లో అయితే 10 నుంచి 15 ఓవర్లు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా బుమ్రాపై ఎక్కువ ఒత్తిడి ఉండకూడదని అనుకుంటున్నాను. “అని రవిశాస్త్రి పేర్కొన్నారు.

Sports: భారత కొత్త కెప్టెన్ గురించి రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు

పర్యటన

శుభ్‌మన్ గిల్ బాగా రాణిస్తున్నాడని అతడికి ఒక అవకాశం ఇవ్వాలని రవిశాస్త్రి పేర్కొన్నారు. శుభ్‌మన్ గిల్(Shubhman Gill) వయస్సు కేవలం 25-26 సంవత్సరాలు అని గిల్ కు ఇప్పుడు ఒక అవకాశం ఇవ్వాలన్నారు. ఇది కాకుండా రిషబ్ పంత్ కూడా ఉన్నాడని చెప్పుకొచ్చారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు దశాబ్ధ కాలం పాటు జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశాలు ఉంటాయన్నారు. ఇద్దరికీ కెప్టెన్సీలో చాలా అనుభవం ఉందన్నారు. 2025 జూన్-జులైలో ఇండియా ఏ జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు ప్రతిపాదించబడింది. దీనిలో జట్టు నాలుగు రోజుల మ్యాచ్‌లు, పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడాలి. ఈ పర్యటన లక్ష్యం యువ ఆటగాళ్లను అంతర్జాతీయ క్రికెట్ స్థాయికి సిద్ధం చేయడం.హృషికేశ్ కనిత్కర్ కోచ్‌గా ఉండటంతో ఈ పర్యటనలో భారత యువ జట్టు అద్బుతంగా రాణిస్తుందని, సీనియర్ జట్టులో స్థానం సంపాదించడానికి బలమైన అడుగు వేస్తుందని భావిస్తున్నారు.అభిమన్యు ఈశ్వరన్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధ్రువ్ జురేల్(వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), మానవ్ సుతార్, తనుష్ కోటియన్, ముకేష్ కుమార్, ఆకాష్ దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్ పాండే, హర్ష్ దూబే.మే 30-జూన్ 2 : ఇంగ్లాండ్ లయన్స్ వర్సెస్ ఇండియా ఏ, కాంటర్బరీ.జూన్ 6-జూన్ 9: ఇంగ్లాండ్ లయన్స్ వర్సెస్ ఇండియా ఏ, నార్తాంప్టన్.జూన్ 13-జూన్ 16: ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లు, బెకెన్‌హామ్.

Read Also: Sports: నీరజ్ చోప్రాను అభినందించిన పీఎం మోదీ

#IndiaVsEngland #JaspritBumrah #RaviShastri #TeamIndia #TestCaptain Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.