📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Ratan Tata: వెలుగులోకి రతన్ టాటా వీలునామా.. వంటమనిషికి కోటి!

Author Icon By Vanipushpa
Updated: April 2, 2025 • 1:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రతన్ టాటా పేరు వినగానే అతని గురించి మీకు తెలిసే ఉంటుంది. అయితే రతన్ టాటా మరణం తరువాత కొన్ని విషయాలు ఒకొక్కటిగా బయటికొస్తున్నాయి. తాజా అతని వీలునామాకి సంబంధించి సమాచారం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ పారిశ్రామికవేత్త అయినా రతన్ టాటా ఎంత ఉదార​​స్వభావి అనేది ఆయన వీలునామా ద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే అతను తన ఇంటి పనివారికి, ఆఫీస్ సిబ్బందికి దాదాపు రూ.3.5 కోట్లు వీలునామాలో రాసిచ్చాడు. వీరిలో కార్ క్లీనర్ నుండి ప్యూన్ వరకు అందరూ ఉన్నారు. అతను తన ఉద్యోగులకు, పక్కింటి వారికీ ఇచ్చిన అప్పు కూడా మాఫీ చేశాడు.

పార్ట్‌టైమ్ హెల్పర్లు, కార్ క్లీనర్లకు కూడా లక్ష రూపాయలు

అయితే రతన్ టాటా గత ఏడాది అక్టోబర్‌లో మరణించగా, తన ఇంటి పనిమనుషులకు ఇంకా ఎన్నో ఏళ్లుగా చేస్తున్న సేవలకి అనుగుణంగా రూ.15 లక్షలు ఇవ్వాలని తన వీలునామాలో పేర్కొన్నారు. అలాగే, పార్ట్‌టైమ్ హెల్పర్లు, కార్ క్లీనర్లకు కూడా లక్ష రూపాయలు ఇవ్వాలని కోరారు. అతని బట్టలన్నీ కూడా NGOలకు ఇవ్వబడతాయి, ఎందుకంటే వాటిని అవసరమైన వారికి ఇవ్వడం చేయవచ్చు.
వంటమనిషి రాజన్ షాకు కోటి రూపాయలు
టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం, రతన్ టాటా చిరకాల వంటమనిషి రాజన్ షాకు కోటి రూపాయలకు పైగా రాసిచ్చాడు. ఇందులో రూ.51 లక్షల అప్పు మాఫీ చేస్తూ కూడా ఉంది. ఆయన తన బట్లర్ సుబ్బయ్య కోనార్ కు రూ.66 లక్షలు ఇవ్వాలని, ఇందులో రూ.36 లక్షల అప్పు మాఫీ కూడా ఉంది. తన సెక్రెటరీ దిల్నాజ్ గిల్డర్ కు కూడా రూ.10 లక్షలు కేటాయించారు. కార్నెల్ విశ్వవిద్యాలయంలో MBA చదవడానికి తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శంతను నాయుడుకి ఇచ్చిన రూ.1 కోటి అప్పు కూడా టాటా మాఫీ చేశాడు. అంతేకాదు తన డ్రైవర్ రాజు లియోన్‌కు రూ.1.5 లక్షలు ఇచ్చి, అతని రూ.18 లక్షల అప్పు కూడా మాఫీ చేశాడు.

జర్మన్ షెపర్డ్ కు 12 లక్షలు
టాటా ట్రస్ట్ కన్సల్టెంట్ హోషి డి మలేసర్‌కు రూ.5 లక్షలు, అలీబాగ్ బంగ్లా కేర్‌టేకర్ దేవేంద్ర కాటమోళ్లుకు రూ.2 లక్షలు, పర్సనల్ అసిస్టెంట్ దీప్తి దివాకరన్‌కు రూ. 1.5 లక్షలు, ప్యూన్‌లు గోపాల్ సింగ్, పాండురంగ్ గురవ్‌లకు రూ.50 వేలు ఇవ్వాలని పేర్కొన్నారు. తన హెల్పర్స్ ఒకరైన సర్ఫరాజ్ దేశ్‌ముఖ్‌కు ఇచ్చిన రూ.2 లక్షల అప్పు కూడా ఆయన మాఫీ చేశారు. అయితే తన జర్మన్ షెపర్డ్ టిటో కోసం రూ.12 లక్షలు కేటాయించాడు. టిటో ఇప్పటికీ రాజన్ షా సంరక్షణలోనే ఉంది.
టాటా ఇంటి పక్కన ఉండే జేక్ మల్లెట్ కు UKలోని వార్విక్ బిజినెస్ స్కూల్లో MBA చదివేందుకు ఇచ్చిన రూ. 23.7 లక్షల అప్పుడు కూడా మాఫీ చేశాడు. మల్లెట్ ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ఉంటున్నారు. టాటా ఆస్తిలో మూడింట ఒక వంతు (షేర్లు అండ్ రియల్ ఎస్టేట్ మినహా) మాజీ తాజ్ ఉద్యోగి మోహిని దత్తాకు ఇచ్చారు.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu One crore to the cook! Paper Telugu News Ratan Tata's will comes to light Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.