బీజేపీ నేత, తెలంగాణ ఎమ్మెల్యే తి. రాజా సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.బోనాల పండుగ నిర్వహణకు సమయం దగ్గర పడుతున్న వేళ రాజా సింగ్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. బోనాల వేళ అలాంటి వారిని ఆలయంలోనికి అనుమతించవద్దని రాజా సింగ్ సూచించారు. ఆయన ఎవరిని గుడిలోకి రానివ్వొద్దని చెప్పారంటే మందుబాబులను, అవును కొందరు ప్రబుద్ధులు మద్యం సేవించి (Drink alcohol) ఏమాత్రం ఆలోచన లేకుండా పవిత్రమైన ఆలయంలోకి వస్తుంటారు. అదిగో అలాంటి వారిని ఆలయాల్లోకి అనుమతించవద్దని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సూచించారు.బోనాల పండుగ నిర్వహణ వేళ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆలయ కమిటీ సభ్యులకు పలు కీలక సూచనలు చేశారు.
వీటిల్లో ముఖ్యమైనది మందు బాబులను ఆలయాల్లోకి అనుమతించవద్దని కోరడం. బోనాల ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఆలయం వద్ద మద్యం సేవించి ఆలయంలోకి రావద్దు అని రాసి ఉన్నబ్యానర్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని సూచించారు.ఎమ్మెల్యే రాజా సింగ్ ( ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.బోనాలు అంటే మన దృష్టిలో పవిత్రమైన పండుగ. కానీ 18-20 ఏళ్ల పిల్లల దృష్టిలో బోనాలు (Bonalu) అంటే తాగడం,తూగడం, డ్యాన్స్ చేయడం అని వారి మనసులో ముద్రించుకుపోయింది. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని తాగి వచ్చే వారికి ఆలయంలోకి అనుమతి లేదు అని రాసి ఉన్న బ్యానర్‌ని ఏర్పాటు చేయాలి అని రాజా సింగ్ సూచించారు.దేశ సేవకు యువకులు అవసరం అయితే ఎవరూ ముందుకు రావడం లేదు మీరు కనీసం మీ కుటుంబాన్ని కూడా రక్షించుకోలేరంటూ రాజాసింగ్ అసహనం వ్యక్తం చేశారు.
సమాజాన్ని కాపాడే బాధ్యత అందరిపై ఉందని
ప్రస్తుత సమాజంలో ఇలాంటి యువకులు తయారవుతున్నారన్నారు. సమాజాన్ని కాపాడే బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ఇప్పటి యువతను బోనాల గురించి ప్రశ్నించండి. వారు చెప్పే సమాధానం మద్యం, డ్యాన్స్, డీజే అన్నారు. ఇప్పుడు ఉన్న పిల్లలకే బోనాల గురించి తెలియకపోతే ఇక వారికి పుట్టే పిల్లల పరిస్థితి ఏంటి. సమాజాన్ని, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు రాజా సింగ్ (Raja Singh).ఇక బోనాలు అంటే వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలి ఎలాంటి రోగాలు వ్యాపించవద్దు అని అమ్మవారికి మొక్కడమే ఈ పండుగ ప్రధాన ఉద్దేశం అని రాజా సింగ్ చెప్పుకొచ్చారు. కానీ చాలా మందికి ఈ విషయం తెలియదన్నారు.
Read Also: Fly Over: శిల్పా లే ఔట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి