📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Indian Railways: రైల్వే ప్రయాణికుల సౌకర్యం కొత్త సూపర్ యాప్‌

Author Icon By Vanipushpa
Updated: July 1, 2025 • 5:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతీయ రైల్వే(Indian Railways) ప్రయాణికుల సౌకర్యం కోసం RailOne పేరుతో ఒక కొత్త సూపర్ యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్(App) ద్వారా రైల్వే సంబంధిత విచారణలు, టికెట్ బుకింగ్, పీఎన్ఆర్ స్టేటస్ ట్రాకింగ్, రైలు రియల్ టైమ్ లొకేషన్(Real Time Location) తెలుసుకోవడం, ఫుడ్ ఆర్డర్ చేయడం, ఫిర్యాదులు చేయడం వంటి అనేక సేవలను ఒకే యాప్‌లో అందిస్తోంది. ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ RailOne యాప్ రైల్వే సేవలను ఒకే చోటుకు చేర్చడం ద్వారా ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉంటుందని రైల్వే శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
యాప్‌లో లాగిన్ కావచ్చు
రైల్ వన్ యాప్(Rail One app) ముఖ్య ఉద్దేశ్యం సులభమైన, స్పష్టమైన ఇంటర్‌ఫేస్‌తో రైల్వే ప్రయాణికులకు మెరుగైన అనుభూతిని అందించడమని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే రైలు ప్రయాణికులు.. ఇప్పటికే ఉన్న RailConnect లేదా UTSonMobile వివరాలతో ఈ యాప్‌లో లాగిన్ కావచ్చని తెలిపింది. దీని ద్వారా వేర్వేరు పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేసింది. ప్రస్తుతం, రైల్వే ప్రయాణికులు వివిధ సేవల కోసం వేర్వేరు యాప్‌లు, వెబ్‌సైట్‌లను ఉపయోగిస్తున్నారు. టికెట్ బుకింగ్‌ల కోసం IRCTC Rail Connect.. రైలులో భోజనం ఆర్డర్‌ చేసుకోవడానికి IRCTC eCatering Food on Track.. ఫిర్యాదుల కోసం Rail Madad, రిజర్వ్ చేయని టిక్కెట్ల కోసం UTS, రైలు స్థితిని తెలుసుకోవడానికి నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ ఉపయోగిస్తున్నారు.

Indian Railways: రైల్వే ప్రయాణికుల సౌకర్యం కొత్త సూపర్ యాప్‌

IRCTC Rail Connect యాప్ రిజర్వ్‌డ్
టిక్కెట్ల బుకింగ్‌ల కోసం ప్రత్యేక హక్కులను కలిగి ఉంది. ఇప్పటికే ఈ యాప్ 100 మిలియన్ డౌన్‌లోడ్‌లను దాటేసి.. రైల్వేల్లో అత్యంత ప్రజాదరణ పొందిన యాప్‌గా నిలిచింది. కొత్తగా ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకునే ప్రయాణికులు సులభంగా ఇందులో నమోదు చేసుకోవచ్చు. విచారణల కోసం, మొబైల్ నంబర్ ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా గెస్ట్‌గా కూడా యాప్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ RailOne యాప్‌లో R-Wallet (Railway e-wallet) సౌకర్యం కూడా ఉంటుంది. యూజర్లు mPIN, బయోమెట్రిక్ ద్వారా తమ అకౌంట్లలోకి లాగిన్ కావచ్చని తెలుస్తోంది. ఒకే యాప్‌లో అన్ని ప్రయాణికుల సేవలను ఇది అందిస్తుంది. IRCTC రిజర్వ్‌డ్, అన్‌ రిజర్వ్‌డ్, ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌లను బుక్ చేసుకోవడం, పీఎన్ఆర్, రైలు ఎక్కడ ఉందో ట్రాక్ చేయడం, కోచ్ పొజిషన్, రైల్ మదద్, ఫీడ్ బ్యాక్ తెలుసుకోవడమని సంబంధిత వర్గాలు తెలిపాయి.

సోషల్ మీడియాలో ప్రయాణికులు అసహనం
IRCTC యాప్‌లో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. రైల్వే టిక్కెట్ల బుకింగ్ కోసం IRCTC యాప్ ప్రధాన వేదిక అయినప్పటికీ.. ఇటీవల చాలాసార్లు అందులో టెక్నికల్ సమస్యలు తలెత్తాయి. దీంతో రైల్వే ప్రయాణికులు సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేశారు.
ఈ యాప్ ద్వారా టికెట్ రిజర్వేషన్, అన్‌రిజర్వ్డ్ టికెట్ బుకింగ్, ప్లాట్‌ఫారమ్ టికెట్ బుకింగ్, నెలవారీ పాస్ తీసుకోవడం వంటివి చేయవచ్చు. రైలు ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు వేరే థర్డ్ పార్టీ యాప్స్ మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండాలొకేషన్‌ను కూడా ట్రాక్ చేయవచ్చు. పీఎన్ఆర్ స్టేటస్ కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రయాణికుల కోసం ఆహారం ఆర్డర్ చేసే సదుపాయం కూడా ఉంది. ఫిర్యాదుల కోసం రైల్ మదద్ అనే ఫీచర్ కూడా ఉంది. వీడియో, ఆడియో, ఫోటోల ద్వారా ఫిర్యాదులు చేయవచ్చు. రిఫండ్ కోసం కూడా రిక్వెస్ట్ కూడా పెట్టుకోవచ్చు.

Read Also: Encounter: హిందూకుష్ అడవుల్లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Indian Railways digital services Indian Railways super app Indian train booking platform IRCTC new app Latest News in Telugu new railway app 2025 one-stop railway app Paper Telugu News railway booking super app railway passenger app India railway tech upgrade India Telugu News online Telugu News Paper Telugu News Today train travel convenience India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.