📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Pune: పూణే అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్..

Author Icon By Anusha
Updated: July 5, 2025 • 11:17 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహారాష్ట్రలోని పుణే నగరంలో ఇటీవల సంచలనం కలిగించిన ఐటీ ఉద్యోగినిపై అత్యాచారం కేసు ఊహించని మలుపు తిరిగింది. 22 సంవత్సరాల వయస్సున్న ఓ యువతి, తనపై డెలివరీ బాయ్‌లా వచ్చిన వ్యక్తి రసాయన స్ప్రే చేసి స్పృహతప్పిన తర్వాత అత్యాచారం చేశాడని, అనంతరం తనను బెదిరిస్తూ ఓ లేఖతో పాటు సెల్ఫీ తీసి వెళ్లిపోయాడని పుణే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఆరోపణలపై కేసు నమోదు చేసి పోలీసు శాఖ దర్యాప్తు ప్రారంభించగా, షాకింగ్ విషయాలు తెలిశాయి. ముఖ్యంగా అమ్మాయి చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని గుర్తించారు. అలాగే సెల్ఫీ, బెదిరింపు లేఖ వంటివన్నీ ఆమెనే క్రియేట్ చేసిందని వెల్లడించారు. అతడు సదరు యువతిపై ఎలాంటి రసాయన స్ప్రే కూడా చేయలేదని స్పష్టం చేశారు.పుణే పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ (Amitesh Kumar) వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ కేసులో సంచలన నిజాలు బయటపడ్డాయి.

అంతుచిక్కని విషయాలు బయట పడుతున్నాయి

అత్యాచారం చేశాడని ఆరోపించిన వ్యక్తి బాధితురాలికి అపరిచితుడు కాదని చెప్పారు. ఆమెకు గత కొన్ని సంవత్సరాలుగా తెలిసిన వ్యక్తేనని పోలీసులు గుర్తించినట్లు వివరించారు. అంతేకాకుండా ఆ యువతి చెప్పినట్లుగా ఎలాంటి రసాయన స్ప్రే (Chemical spray) ఉపయోగించబడలేదని తేల్చినట్లు పేర్కొన్నారు. సాక్ష్యంగా చూపించిన సెల్ఫీని కూడా బాధితురాలే స్వయంగా తీసుకుని ఎడిట్ చేసిందని, బెదిరింపు సందేశాన్ని కూడా తన ఫోన్‌లో తానే టైప్ చేసిందని పోలీసులు నిర్ధారించారు.ఈ కేసు దర్యాప్తులో అనేక అంతుచిక్కని విషయాలు బయట పడుతున్నాయి. బాధితురాలు మొదట ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పిన కొరియర్ ఏజెంట్ ఆ హౌసింగ్ సొసైటీ సీసీటీవీ ఫుటేజీలో ఎక్కడా కనిపించలేదు. దీని ద్వారానే ఆమె చెప్పింది అబద్ధం అని పోలీసులకు తెలిసింది. ఆ తర్వాతే ఆ యువకుడికి సదరు అమ్మాయికి మధ్య ఉన్న స్నేహం, ఆమె చూపించిన సాక్ష్యాలు కూడా నిజం కాదని గుర్తించారు. అయితే నిజంగానే ఆమెపై అత్యాచారం జరిగిందా లేదా అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

Pune: పూణే అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్..

వెల్లడైన వాస్తవాలకు మధ్య భారీ తేడా ఉండటంతో

ప్రస్తుతం పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరికొన్ని రోజులు గడిస్తే తప్ప ఈ విషయం బయట పడేలా లేదు. మరోవైపు యువతి మానసిక స్థితి సరిగా లేదని అందుకే ఇలా అబద్ధం చెప్పి ఉంటుందని కూడా పోలీసులు భావిస్తున్నారు.ఈ కేసు దర్యాప్తు మొదలైనప్పటి నుంచి దానిలోని లోతుపాతులను గుర్తించేందుకు పోలీసులు అవిశ్రాంతంగా శ్రమిస్తూనే ఉన్నారు. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ (CCTV footage) విశ్లేషణ, ఇతర వివరాలను కూలంకషంగా పరిశీలించిన తర్వాతే ఈ కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలు చెప్పిన కథనానికి, దర్యాప్తులో వెల్లడైన వాస్తవాలకు మధ్య భారీ తేడా ఉండటంతో ఈ కేసు ఇప్పుడు సంక్లిష్టంగా మారింది. అసలు నిజం ఏమంటి, బాధితురాలు ఎందుకు తప్పుడు సమాచారం ఇచ్చింది, అనే కోణాల్లో పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు. ఈ కేసు పూర్తయ్యే సరికి ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Masood Azar: పాకిస్థాన్‌కు మసూజ్ అజర్‌ ఎక్కడున్నాడో తెలియదు: భుట్టో

#AmiteshKumar #BlackmailAttempt #FabricatedEvidence #FakeCase #FakeRapeClaim #FalseAllegation #FalseFIR #ITEmployee #JusticeSystem #MaharashtraNews #PoliceInvestigation #PuneNews #PuneRapeCase #ShockingTwist #WomenMisuseLaw acquaintance Amitesh Kumar Ap News in Telugu blackmail letter Breaking News in Telugu chemical spray claim criminal misuse of law edited selfie fabricated evidence fake rape case false FIR false rape allegation Google News in Telugu IT Employee Latest News in Telugu Maharashtra news Paper Telugu News police clarification Pune police investigation Pune rape case self-created evidence shocking twist Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.