పద్మశ్రీ అవార్డు గ్రహీత,ప్రముఖ యోగా గురువు,స్వామి శివానంద (128) తుదిశ్వాస విడిచారు. వారణాసిలోని నివాసంలో ఆయన కన్నుమూసినట్లు సన్నిహితులు వెల్లడించారు.ప్రస్తుతం శివానంద స్వామి వయసు 128 సంవత్సరాలు.1896 ఆగస్టు 8న అవిభాజ్య భారత్‌లోని సిల్హెత్(ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది) జిల్లాలో నిరుపేద కుటుంబంలో స్వామి శివానంద జన్మించినట్లు వారి శిష్యులు వెల్లడించారు. ఆరేళ్ల వయసులోనే శివానంద తల్లిదండ్రులు మరణించారు. దీంతో ఆయన బెంగాల్ లోని ఓ ఆశ్రమంలో పెరిగారు. గురు ఓంకారానంద గోస్వామి ఆయనను పెంచిపెద్ద చేయడమేగాక, యోగా వంటి ఆధ్యాత్మిక విషయాలను బోధించారు. ఈ క్రమంలోనే తన జీవితాన్ని సమాజసేవకు అంకితం చేశారు.50 ఏళ్లుగా పూరిలో 400-600 కుష్టు రోగులకు సేవ చేశారు. అయితే యోగా రంగానికి చేసిన కృషికి గాను 2022లో శివానంద, అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఆ సమయంలో తెల్లని ధోవతి, కుర్తా ధరించి కాళ్లకు చెప్పులు లేకుండా అత్యంత సామాన్యంగా వచ్చి పురస్కారాన్ని స్వీకరించారు. దీంతో అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించారు.
దిగ్భ్రాంతి
ప్రస్తుతం బాబా శివానంద్ భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం కోసం వారణాసిలోని కబీర్‌నగర్ కాలనీలోని ఆయన నివాసంలో ఉంచారు. ఈ రోజు సాయంత్రం బాబా శివానంద్ అంత్యక్రియలు జరుగుతాయని శిష్యులు తెలిపారు.బాబా శివానంద్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు అధికారిక ఖాతా ఎక్స్ వేదికగా సంతాపం తెలిపారు. ” యోగా గురువు బాబా శివానంద్ మృతి చెందారన్న విషయం తెలుసుకుని బాధపడ్డాను. ఆయన మృతి నన్ను కలిచివేసింది. ఆయన తన లైఫ్ ను యోగా, సాధన కోసం కృషి చేశారు. యోగా ద్వారా ప్రజలకు ఆయన చేసిన సేవకు పద్మశ్రీ అవార్డు అందింది. ఆయన మరణం వారణాసితోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన శిష్యులకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళి అర్పిస్తున్నాను” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
ట్వీట్
మరోవైపు బాబా శివానంద్ మృతిపై ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ నివాళులు అర్పించారు. “యోగాలో ఆయన కృషి మరువలేనిది. మీరు యోగా ద్వారా చేసిన కృషి ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆయన శిశ్యులకు ధైర్యం ఇవ్వాలని వేడుకుంటున్నా. ఓమ్ శాంతి” అని ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ ట్వీట్ చేశారు.ఆయన కఠినమైన దినచర్యకు కట్టుబడి ఉండేవారని, ప్రతిరోజూ తెల్లవారుజామున 3 గంటలకు మేల్కొని యోగా సాధన చేసి తన పనులన్నింటినీ స్వతంత్రంగా నిర్వహించేవారు. ఆయన ఉడికించిన ఆహారాన్ని మాత్రమే తింటూ, చాప మీద పడుకుని, జీవితాంతం సరళత, క్రమశిక్షణను కొనసాగించారు.
Read Also :X – Account: ఇమ్రాన్ ఖాన్,బిలావల్ ఎక్స్ ఖాతా బ్లాక్ చేసిన భారత్