ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, వారణాసిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా, ఇటీవల 19 ఏళ్ల యువతిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన గురించి ఆయన పోలీసులు మరియు కలెక్టర్‌తో మాట్లాడి, యువతిపై జరిగిన గ్యాంగ్ రేప్ గురించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం నిందితులపై చట్టం ప్రకారం కఠిన శిక్షలు అమలు చేయాలని ఆదేశించారు. ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

సంఘటన వివరాలు:
వారణాసిలో జరిగిన ఈ దారుణ సంఘటనలో, 19 ఏళ్ల యువతి పై 23 మందితో 6 రోజుల పాటు సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలికి మత్తు ఇచ్చి, అనేక చోట్ల కు తిప్పుతూ కీచకపర్వాన్ని కొనసాగించినట్లు విచారణలో తేలింది. ఈ ఘటన దారుణమైన ఒక సామూహిక అత్యాచార సంఘటనగా క్షీణమైన నైతిక విలువలను బయట పెట్టింది. ఈ ఘటనపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి, బాధితురాలి ఇచ్చిన ఫిర్యాదుతో అనుసంధానంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు 18 మందిని అరెస్ట్ చేశారు. మిగిలిన 5 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిందితులపై పోక్సో యాక్ట్, ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా స్పందించడమే కాకుండా, అధికారులను కఠిన చర్యలకు ఆదేశించడం సామాన్య ప్రజలకు ఆశ చిగురించే పరిణామం. అయితే ఇదే స్థాయిలో ప్రతి లైంగిక దాడి ఘటనలోనూ ప్రభుత్వం స్పందించాలన్నది సమాజంలోని ప్రతి ఒక్కరి కోరిక. అయితే నిందితులు శిక్షపడే వరకు ప్రజల ఆగ్రహం, బాధితురాలికి మద్దతు కొనసాగాలి.
Read also: Apple: ఆపిల్ కీలక నిర్ణయం ..శక్తివంతమైన తయారీ కేంద్రంగా భారత్!