ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అభివృద్ధి చేసిన 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను (103 Amrit Stations) ప్రారంభించారు. ఇవి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా, ఆధునిక సదుపాయాలతో నిర్మించబడ్డాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం (Amrit Bharat Station Scheme)లో భాగంగా మొత్తం 18 రాష్ట్రాల్లో తీర్చిదిద్దిన వీటిని రాజస్థాన్‌లోని బికనీర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంబించారు.

సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా..
103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల జాబితాలో తెలంగాణలోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వేస్టేషన్లు, ఏపీలోని సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ ఉన్నాయి. ఆయా ప్రాంతాల సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ రైల్వే స్టేషన్ల ముఖద్వారాలు, ప్రధాన భవనాల నిర్మాణం చేపట్టారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, వెయిటింగ్ హాళ్లు, టికెట్ బుకింగ్ కౌంటర్లు, టాయిలెట్లను పునర్నిర్మించారు. సైన్ బోర్డులు బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక బేగంపేట రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ పథకం ద్వారా రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడం, ప్రయాణికులకు సురక్షితమైన, ఆధునికమైన వాతావరణం కల్పించడమే ముఖ్య లక్ష్యం. ఇదివరకూ పరామర్శలకు గురైన పాత స్టేషన్లు ఇప్పుడు ఆధునికతతో కూడిన, సంస్కృతి ప్రతిబింబించే కేంద్రాలుగా మారిపోతున్నాయి. ఈ అభివృద్ధి కార్యక్రమం భారతదేశంలోని రైల్వే స్టేషన్లను ఆధునిక, ప్రయాణికుల అనుకూలమైన కేంద్రాలుగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది.ఈ అభివృద్ధి కార్యక్రమం మొత్తం రూ. 1,100 కోట్లతో చేపట్టబడింది.
ప్రధాన లక్ష్యం
ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడం, ఆధునిక సదుపాయాలు కల్పించడం, మరియు రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం.
ప్రధాన సదుపాయాలు
మరింత శుభ్రత మరియు శుభ్రతా సౌకర్యాలు, ప్రత్యేక అవసరాలున్న వ్యక్తులకు సౌకర్యాలు, ఉచిత వైఫై సేవలు, ఆధునిక టికెట్ల వ్యవస్థ, ప్రయాణికుల కోసం మెరుగైన వేచి ఉండే ప్రాంతాలు.
Read Also : Pakistan: భారత్ కు పాకిస్థాన్ గగనతల మూసివేత మరో నెల రోజులు పొడిగింపు