గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్(Ahmedabad) నగరంలో,ఒక పెను విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అహ్మదాబాద్ టూ లండన్ వెళ్లే ఎయిర్ ఇండియా AI-171 విమానం ప్రమాదానికి గురైంది. మధ్యాహ్నం 1:17 గంటలకు అహ్మదాబాద్ నుంచి విమానం టేకాఫ్ తీసుకున్న వెంటనే కూలిపోయింది. మేఘానీ ప్రాంతంలోని షాహీబాగ్ హోటల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఇది బోయింగ్ – 787 డ్రీమ్ లైనర్ కాగా దీని రిజిస్ట్రేషన్ నెంబర్ VT – ANBగా ఉంది. ప్రమాద సమయంలో 242మంది ప్రయాణికులు విమానంలో ఉన్నట్లు సమాచారం.
విమానం
ఇక ఈ విమాన దుర్ఘటనకు సంబంధించిన లైవ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టేకాఫ్ అయిన కాసేపటికే అది నేలకూలింది. విమానం కూలగానే భారీ పేలుడు సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. ఈ విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్‌రూపానీ ఉన్నట్టు తెలుస్తోంది.
భారీ పేలుడు
విమానం కూలగానే భారీ పేలుడు సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి.
సమాచారం
చెట్టును ఢీకొట్టి జనావాసాలపై విమానం కూలింది. సమాచారం అందుకోగానే అంబులెన్స్‌లు, ఫైరింజిన్లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం రన్ వే తాత్కాలికంగా మూసివేశారు.
Read Also: Ahmedabad: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ?