📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Pbks vs Mi: ముంబైపై పంజాబ్‌ గెలుపు

Author Icon By Anusha
Updated: May 27, 2025 • 12:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో 19 పాయింట్లను ఖాతాలో వేసుకున్న పంజాబ్ కింగ్స్ అగ్రస్థానంలో నిలిచి క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది. ముంబై నిర్దేశించిన 185 పరుగుల ఛేదనను ఆ జట్టు 18.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి దంచేసింది. జోష్‌ ఇంగ్లిస్‌ (42 బంతుల్లో 73, 9 ఫోర్లు, 3 సిక్సర్లు), ప్రియాన్ష్‌ ఆర్య (35 బంతుల్లో 62, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరబాదుడు బాది ముంబై టాప్‌-2 ఆశలపై నీళ్లు చల్లారు. మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై సూర్యకుమార్‌ యాదవ్‌ (39 బంతుల్లో 57, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.

ఇన్నింగ్స్‌

ఛేదనలో కింగ్స్‌ ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ (13) క్రీజులో నిలిచేందుకు ఇబ్బందిపడుతూ ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌లోనే నిష్క్రమించినా మరో ఓపెనర్‌ ప్రియాన్ష్‌ అండగా మూడో స్థానంలో వచ్చిన ఇంగ్లిస్‌ చెలరేగిపోయాడు. ప్రియాన్ష్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడగా క్రీజులో కుదురుకున్నాక ఇంగ్లిస్‌ జోరు పెంచాడు. అశ్వని ఓవర్లో హ్యాట్రిక్‌ బౌండరీలు బాదిన ఇంగ్లిస్‌ హార్దిక్‌ ఓవర్లో సింగిల్‌ తీసి ఫిఫ్టీ పూర్తిచేశాడు. ఇదే ఓవర్లో ప్రియాన్ష్‌ 4, 6తో హాఫ్‌ సెంచరీ సాధించాడు. రెండో వికెట్‌కు ఈ ఇద్దరూ 59 బంతుల్లో 109 రన్స్‌ జోడించి కింగ్స్‌ను గెలుపు దిశగా తీసుకెళ్తుండగా ఎట్టకేలకు శాంట్నర్‌ 15వ ఓవర్లో ప్రియాన్ష్‌(Priyansh)ను ఔట్‌ చేశాడు. విజయం ముంగిట ఇంగ్లిస్‌ కూడా నిష్క్రమించినా శ్రేయాస్‌ (26*), వధెర (2*) లాంఛనాన్ని పూర్తిచేశారు.

Pbks vs Mi: ముంబైపై పంజాబ్‌ గెలుపు

కట్టుదిట్టంగా

ఈ సీజన్‌లో టాప్‌ ఫామ్‌లో ఉన్న సూర్య మరోసారి ముంబై ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా మారాడు. ఓపెనర్లు రోహిత్‌ (24), రికెల్టన్‌ (27) ఫర్వాలేదనిపించినా ఆశించిన స్థాయిలో మెరుపులు మెరిపించలేదు. రికెల్టన్‌ ఆరో ఓవర్లో యాన్సెన్‌ బౌలింగ్‌లో శ్రేయాస్‌(Shreyas Iyer)కు క్యాచ్‌ ఇవ్వడంతో సూర్య క్రీజులోకి వచ్చాడు. అతడు జెమీసన్‌ 9వ ఓవర్‌లో 6, 4, 4తో స్కోరువేగం పెంచాడు. తిలక్‌ (1), విల్‌ జాక్స్‌ (17) నిరాశపరచగా మిడిల్‌ ఓవర్స్‌లో పంజాబ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ముంబై ధాటిగా ఆడలేకపోయింది. కానీ హార్దిక్‌ (26) రెండు బౌండరీలు, రెండు సిక్సర్లతో ముంబై ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. అయితే అతడు యాన్సెన్‌ ఓవర్లో నిష్క్రమించినా ఆఖర్లో నమన్‌ (20)తో కలిసి సూర్య మెరుపులు మెరిపించి ముంబైకి పోరాడే స్కోరును అందించాడు.

Read Also : Shreyas Iyer: ఐపిఎల్ లో చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్

#IPL2025 #PlayoffsBound #PunjabKings #ShreyasIyer #TopOfTheTable Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.