📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Life Term: పెళ్లి కానుకగా పార్సిల్‌ బాంబ్‌.. లెక్చరర్‌కు యావజ్జీవ శిక్ష..!

Author Icon By Vanipushpa
Updated: May 28, 2025 • 4:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తల్లిమీద కోపంతో ఆమె కొడుకుకు మ్యారేజ్‌ గిఫ్ట్‌ (Marriage gift) గా పార్సిల్‌ బాంబు (Parcel Bomb) పంపి ఇద్దరి మరణానికి కారణమైన వ్యక్తికి ఒడిశా (Odisha) లోని బొలాంగిర్‌ జిల్లా (Bolangir district) కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష (Life term) విధించింది. 2018 నాటి ఈ కేసులో ఇవాళ (బుధవారం) విచారణ జరిపిన ప్రతాప్‌గఢ్‌ అడిషనల్‌ జిల్లా జడ్జి.. నిందితుడు పంజీలాల్‌ మెహర్‌ను దోషిగా తేల్చారు. అతడికి జీవితఖైదు విధించడంతోపాటు రూ.1.70 లక్షల జరిమానా విధించారు.
వివరాల్లోకి వెళ్తే.. పంజీలాల్‌ మెహర్‌ భైన్సాలోని జ్యోతి వికాస్‌ కాలేజీలో లెక్చరర్‌గా విధులు నిర్వహించేవాడు. అదే కాలేజీలో సంయుక్త సాహు అనే మహిళ ప్రిన్సిపల్‌గా పనిచేసేవారు. అయితే ఈ ఇద్దరి మధ్య వృత్తిగతమైన తగాదా ఉంది. దీన్ని మనసులో పెట్టుకున్న మెహర్‌.. సంయుక్త సాహు కొడుకు పెళ్లిని ఆసరాగా చేసుకుని పెళ్లికొడుకును చంపేయాలని నిర్ణయించుకున్నాడు.

Life Term: పెళ్లి కానుకగా పార్సిల్‌ బాంబ్‌.. లెక్చరర్‌కు యావజ్జీవ శిక్ష..!

2018 ఫిబ్రవరి 23న ఘటన
అందుకోసం మ్యారేజ్‌ గిఫ్టుగా పార్సిల్‌ బాంబును పంపించాడు. ఆ పార్సిల్‌ ఓపెన్‌ చేయగానే బాంబు పేలడంతో సంయుక్త సాహు కుమారుడు పెళ్లికొడుకు అయిన సౌమ్య సాహు ప్రాణాలు కోల్పోయాడు. అతడితోపాటు అతడి నానమ్మ కూడా మృతిచెందింది. పెళ్లికుమార్తెకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. 2018 ఫిబ్రవరి 23న ఘటన జరుగగా అదే ఏడాది మార్చి 23న క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. 2018 ఏప్రిల్‌లో మెహర్‌ను అరెస్ట్‌ చేశారు. అప్పటి నుంచి మెహర్‌ ప్రతాప్‌గఢ్‌ సబ్‌జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉంటూ విచారణ ఎదుర్కొన్నాడు. తాజాగా స్థానిక కోర్టు అతడికి యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.1.70 లక్షల జరిమానా విధించింది. ఈ ఘటన విద్వేషం ఎప్పటికీ శాంతిని తీసుకురాదు అన్న సత్యాన్ని మళ్లీ ఒకసారి గుర్తు చేస్తోంది. ఒక వ్యక్తి తన వృత్తిపరమైన అసంతృప్తిని ఇలా ప్రాణహానికరమైన చర్యగా మార్చడం ఎంత భయానకమో ఇది స్పష్టం చేస్తుంది.

Read Also: Haryana: ఆ ఏడుగురి ఆత్మహత్య వెనుక అప్పులే కారణం

#telugu News Ap News in Telugu as a wedding gift Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Lecturer gets life sentence..! Paper Telugu News Parcel bomb Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.