పహల్గామ్ (Pahalgam) దాడి జరిగి సరిగ్గా 15 రోజుల తర్వాత పాకిస్తాన్ (Pakistan) లోని ఉగ్రవాదులపై భారత్(India) ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ కింద భారతదేశం నిర్వహించిన వైమానిక దాడిలో చాల మంది తీవ్రవాదులు హతమయ్యారు. కానీ భారతదేశం పాకిస్తాన్‌పై యుద్ధానికి వెళ్ళాక ముందే పేదరికంలోకి పడిపోతుంది. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే సైన్యాన్ని బలపర్చుకోవడానికి ప్రతిరోజూ బిలియన్ల రూపాయలు ఖర్చు చేయవలసి వస్తుంది. పహల్గామ్ దాడి తరువాత భారతదేశం పాకిస్తాని ఆర్థికంగా దెబ్బతీస్తూ కష్టాల్లోకి నెట్టేసింది. దింతో చైనా (china) సహా ఇతర దేశాలు కూడా పాకిస్తాన్ నుండి దూరం అవడం ప్రారంభించాయి.
భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత
భారతదేశం ఇంకా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత ప్రస్తుతం తార స్థాయికి చేరుకుంది. ఇది పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితుల పై స్పష్టంగా ప్రభావం చూపుతుంది. పహల్గామ్ దాడి తర్వాత భారత్ కఠిన చర్యలు తీసుకోవడంతో యుద్ధానికి ముందే పాకిస్తాన్‌ను దివాళా తీసేలా భారతదేశం అనుసరించింది. సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసాక వాణిజ్యాన్ని కూడా నిలిపివేసింది. దింతో పాకిస్తాన్లో నీటి సమస్యతో పాటు ఆర్థిక సమస్యలు కూడా మొదలయ్యాయి.
ప్రతిరోజూ 4 బిలియన్లు ఖర్చు
పాకిస్తాన్ అప్రమత్తంగా ఉండటానికి ప్రతిరోజూ 4 బిలియన్లు (పాకిస్తానీ రూపాయలు) ఖర్చు చేస్తోందట. మీడియా నివేదికల ప్రకారం, పాకిస్తాన్ ప్రస్తుతం సరిహద్దులో దళాలను మోహరించడం, విమానాలకు ఇంధనం, సరిహద్దుకు వస్తువులను పంపడం కోసం దాదాపు 13 మిలియన్ డాలర్లు ఖర్చు చేయవలసి వస్తుంది. పాకిస్తాన్ అన్యువల్ బడ్జెట్ (Paksitan Annual Budget) గురించి మాట్లాడుకుంటే దాదాపు 2.10 లక్షల కోట్ల పాకిస్తానీ రూపాయలు. మరోవైపు భారతదేశం ఇంకా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత కొనసాగుతున్నందున హై అలర్ట్ సమయంలో మాత్రమే చేసిన ఖర్చు గురించి మాట్లాడితే పాకిస్తాన్ దీనిపై అంచనా వేసిన పాకిస్తాన్ రూపాయల్లో 11,253 కోట్లు చేరుకుంటుంది.
పాకిస్తాన్‌లో పిండి ధర ఎంతంటే: భారతదేశంలో గోధుమ పిండి ధర సాధారణంగా రూ.40 నుండి ప్రారంభమై రూ.60-65 వరకు ఉంటుంది. కానీ పాకిస్తాన్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గోధుమ పిండి ధర ఆకాశాన్నంటుతోంది. పాకిస్తాన్ ఆన్‌లైన్ డెలివరీ గ్రోసరీ యాప్‌లో చూస్తే పాకిస్తాన్‌లోని లాహోర్ నగరంలో 5 కిలోల పిండి ధర రూ. 615గా ఉంది.
పాకిస్తాన్‌లో కరువు : పహల్గామ్ దాడి తర్వాత 1960లో చేసిన సింధు జల ఒప్పందాన్ని భారతదేశం రద్దు చేసింది. దింతో పాకిస్తాన్‌కు వెళ్లే నీటిని భారతదేశం నిలిపివేసింది. పాకిస్తాన్ వ్యవసాయంలో 80 శాతం సింధు నది నీటితోనే సాగు అవుతుంది. అయితే ప్రస్తుతం వేసవి ఇలాంటి సమయంలో నీటి సరఫరా నిలిచిపోతే పాకిస్తాన్‌లో కరువు పరిస్థితి తలెత్తవచ్చు ఇంకా పాకిస్తాన్‌లో ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని తాకవచ్చు.
Read Also: Pakistan Earthquake: 4.0 తీవ్రతతో పాకిస్థాన్‌లో భూకంపం