బంగాల్ ఎన్నికలకు సమయం ఉండగానే, అక్కడ రాజకీయ వాతావరణం వేడెక్కింది. అలీపుర్‌దుర్(Alipurduar)లో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో ప్రధాని నరేంద్రమోదీ(Narendra Modi) చేసిన తీవ్ర విమర్శలకు సీఎం మమతా బెనర్జీ(Mamatha Benerjee గట్టిగా స్పందించారు. వెంటనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగలరా అంటూ సవాల్ విసిరారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)ను రాజకీయ లబ్ధికి వినియోగించుకోవడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. అయితే ఆపరేషన్ ఇంకా పూర్తికాలేదని బెంగాల్(Bengal) గడ్డ మీద నిలబడి, 140 కోట్ల మంది భారతీయుల తరఫున ప్రకటిస్తున్నానని మోదీ అలీపుర్‌దుర్ ర్యాలీలో అన్నారు. ఏప్రిల్ 22 జరిగిన పహల్గాం ఉగ్రదాడిపై బంగాల్‌లో కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైందమని చెప్పారు. సిందూరం శక్తి ఏంటో మన ఆర్మీ ఉగ్రవాదులకు రుచి చూపించిందని పేర్కొన్నారు. మనం వారి ఇంట్లోకి ప్రవేశించి, మూడుసార్లు దాడులు చేశామని పాకిస్థాన్ అర్థం చేసుకోవాలని సూచించారు.
‘మోదీ ఎందుకు సిందూర్ పెట్టడం లేదు?’
ఇప్పుడు ఆపరేషన్ సిందూర్‌పై మోదీ చేసిన వ్యాఖ్యలకు మమత స్పందించారు. “మొదట ఆయన తనను తాను చాయ్‌వాలా అని చెప్పుకున్నారు, ఆ తర్వాత గార్డు అన్నారు, ఇప్పుడు సిందూర్ అమ్మడం ప్రారంభించారు. సిందూర్ మహిళలకు గర్వకారణం. ప్రతి మహిళ తన భర్త నుంచి సిందూర్ తీసుకుంటుంది. అందుకే సిందూర్‌ను ఇలా అమ్మకూడదు. మోదీ తన సతీమణికి సిందూర్ ఎందుకు పెట్టడం లేదు?” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రధానమంత్రి రాజకీయాలు చేస్తున్నారు: మమత
“మన మహిళల సిందూర్ చెరిపినందుకు ఆపరేషన్ సిందూర్‌ను అని పెట్టారు. కానీ ఇప్పుడు రాజకీయంగా ఆకర్షణీయంగా మార్చడానికి ఆ పేరు పెట్టినట్లు మార్చుతున్నారు. అది సముచితం కాదు. కానీ నేను ఇప్పుడు దానిపై వ్యాఖ్యానించాలనుకోవడం లేదు. అన్ని దేశాల్లో అఖిలపక్ష ప్రతినిధి బృందాలు గళం విప్పుతోంది. ఆ సమయంలో ఇక్కడ మన ప్రధానమంత్రి రాజకీయాలు చేస్తున్నారు. అది చాలా బాధాకరం” అని మమత అన్నారు.
బీజేపీ నేతలా రాజకీయాలు!
“పహల్గాం ఘటనపై యావత్ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఆపరేషన్ సింధూర్‌తో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాం. మేమంతా ఒక్కటే, ఉగ్రవాదాన్ని సహించేది లేదు, ఐక్యతే మా బలం అనే సందేశాన్ని తెలియజేయడానికి అఖిలపక్ష ప్రతినిధులు విదేశాలల్లో పర్యటిస్తున్నారు. మా అభిషేక్ బెనర్జీ కూడా అందులో ఉన్నారు. ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాయి. కానీ ఆయన ప్రధానిగా కాకుండా బీజేపీ నేతలా రాజకీయాలు చేస్తున్నారు” అని ఆరోపించారు
ఆపరేషన్ సిందూర్లాగా రాష్ట్రంలో ఆపరేషన్ బంగ్లా చేయడానికి బీజీపీ యత్నిస్తోందని మమత ఆరోపించారు. “ఇన్ని సంవత్సరాలు పాలించడం ద్వారా మోదీ దేశానికి ఏమి ఇచ్చారు? ఎందుకు ఇప్పుడు సమావేశాలకు వచ్చారు. ధైర్యం ఉంటే రేపే ఎన్నికలకు వెళ్లండి అని సవాలు చేస్తున్నాను. మేం సిద్ధంగా ఉన్నాం. బంగాల్ సిద్ధంగా ఉంది. కానీ గుర్తుంచుకోండి. దేశ ప్రయోజనాల కోసం మేం ఎల్లప్పుడూ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాం, తీసుకుంటాం. కానీ దేశ సైన్యం కార్యకలాపాలను రాజకీయం చేయడం, దానిని ఎన్నికల ప్రచారం కోసం ఒక సాధనంగా ఉపయోగించడం ఎప్పుడూ సరైనది కాదు” అంటూ మమత వ్యాఖ్యానించారు.
Read Also: CII Conference : సీఐఐ సదస్సులో ప్రసంగించనున్న సీఎం చంద్రబాబు