BJP national president : బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరు? రేపే ప్రమాణ స్వీకారం!

Read Time:  1 min
BJP national president
BJP national president
FONT SIZE
GET APP

BJP national president : భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా Nitin Nabin ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రేపు ఉదయం 11 గంటలకు ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు JP Nadda పదవీకాలం ముగియడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది.

ప్రస్తుతం నితిన్ నబీన్ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో ఆయనను ఈ పదవికి బీజేపీ అధిష్ఠానం నియమించింది. అప్పటి నుంచే నబీన్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపిక చేయనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Read Also: Singareni Collieries: మీడియాకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

46 ఏళ్ల నితిన్ నబీన్ బీహార్ రాష్ట్రానికి చెందినవారు. ఆరెస్సెస్ (BJP national president) నేపథ్యంతో పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఆయన, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బాంకీపూర్ నియోజకవర్గం నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పార్టీ సంస్థాగత బలోపేతంలో ఆయన పాత్ర కీలకమని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.