📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం, విక్సిత్ భారత్… క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం, విక్సిత్ భారత్… క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

Latest Telugu News : Nitin Gadkari : ఇథ‌నాల్ క‌లిసిన పెట్రోల్ ప‌ర్యావ‌ర‌ణ‌హితం.. కేంద్ర మంత్రి గ‌డ్క‌రీ

Author Icon By Sudha
Updated: December 11, 2025 • 3:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్ర రోడ్డు, ర‌వాణా శాఖ మంత్రి గ‌డ్క‌రీ(Nitin Gadkari) ఇవాళ లోక్‌స‌భ‌లో ఇథ‌నాల్ గురించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇథ‌నాల్ క‌లిసిన పెట్రోల్‌.. రైతుల‌కు లాభ‌దాయ‌కంగా ఉన్న‌ట్లు చెప్పారు. దీని వ‌ల్ల సుమారు 1.40 ల‌క్ష‌ల కోట్ల విదేశీ మార‌కం ఆదా అయిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఇథ‌నాల్ క‌లిసిన పెట్రోల్ ప‌ట్ల ఆందోళ‌న‌లు వ్య‌క్తం అవుతున్న నేప‌థ్యంలో కేంద్ర రోడ్డుర‌వాణా, ర‌హ‌దారుల శాఖ మంత్రి గ‌డ్క‌రీ స్పందించారు. ఇథ‌నాల్ పెట్రోల్‌పై చాలా విస్తృత స్థాయిలో ప‌రీక్ష‌లు జ‌రిగిన‌ట్లు చెప్పారు. ఇథ‌నాల్ క‌లిపిన పెట్రోల్ వాడిన కార్ల‌లో ఎటువంటి చెడు ప్ర‌భావం క‌నిపించ‌లేద‌ని అన్నారు. ఈ-20 పెట్రోల్ వాడ‌కం చాలా ఆరోగ్య‌క‌ర‌మైన ప‌రిణామం అని, ఇది హ‌రిత మార్పు అని, ఈ పెట్రోల్‌తో చాలా త‌క్కువ కాలుష్యం ఉంటుంద‌ని, దీని వ‌ల్ల విదేశీ మార‌కం కూడా ఎక్కువ‌గా ఆదా అవుతుంద‌ని లోక్‌స‌భ‌లో గ‌డ్క‌రీ (Nitin Gadkari) తెలిపారు. ఇథ‌నాల్‌ను పెట్రోల్‌లో క‌ల‌ప‌డం వ‌ల్ల .. ముడి స‌రుకుల కోసం రైతుల‌కు 40 కోట్లు ఇవ్వ‌డం జ‌రుగుతోంద‌ని, ఇథ‌నాల్ త‌యారీ కోసం చెరుకు, మొక్క‌జొన్న ముడి ప‌దార్ధాల‌ను వాడుతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

Read Also :http://Lok Sabha Elections : రాహుల్ Vs అమిత్ షా

Nitin Gadkari

పెట్రోలియం శాఖ మంత్రి హ‌ర్‌దీప్‌ సింగ్ పురి మాట్లాడారు. ఇథ‌నాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అమ‌లు ద్వారా .. గ‌తంలో క్రూడ్ ఇంధ‌నం దిగుమ‌తి కోసం అయ్యే ఖ‌ర్చును ఇప్పుడు రైతుల‌కు ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. దీనితో రైతులు అన్న‌దాత‌లే కాదు, ఇప్పుడు ఊర్జ‌దాత‌లు కూడా అయిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. గ‌డిచిన 11 ఏళ్ల‌లో అంటే 2014 నుంచి 2025 జూలై వ‌ర‌కు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇథ‌నాల్‌ను బ్లెండ్ చేసిన‌ట్లు చెప్పారు. ఆ స‌మ‌యంలో విదేశీ మార‌క రూపంలో సుమారు 1.40 ల‌క్ష‌ల కోట్లు ఆదా అయిన‌ట్లు మంత్రి పేర్కొన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News Environment Friendly Ethanol blended petrol indian government latest news Nitin Gadkari Telugu News Transport Ministry

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.