నేపాల్‌లోని (Nepal Bus Accident) బైతాడి జిల్లాలో గురువారం రాత్రి చోటుచేసుకున్న బస్సు ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పెళ్లి వేడుక పూర్తయ్యాక సంతోషంగా తిరుగు ప్రయాణం మొదలుపెట్టిన వేళ, ఈ విషాద ఘటన జరగడం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. పెళ్లి వేడుక ముగించుకుని తిరిగి వస్తుండగా, బైతాడి జిల్లాలోని పుర్చౌడి మున్సిపాలిటీ పరిధిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సుమారు 60 మందితో వెళ్తున్న ఈ బస్సు కొండ ప్రాంతంలోని వంకర మార్గంలో ప్రయాణిస్తూ నియంత్రణ కోల్పోయి లోయలోకి దూసుకెళ్లింది.
Read Also: Illegal Belt Shops: అధిక ధరలు..అక్రమ బెల్టుషాపులు

గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు
ఈ ఘటనలో 45 మందికి పైగా గాయపడగా, వారిలో 16 మంది పరిస్థితి విషమంగా ఉంది. వీరందరినీ సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అయితే, వధూవరులు వేరే వాహనంలో ప్రయాణిస్తుండటంతో వారు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే నేపాల్ సైన్యం, పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టి క్షతగాత్రులను బయటకు తీశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: