📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

NEET UG 2025: నీట్ 2025 ఆన్సర్ కీ విడుదల

Author Icon By Anusha
Updated: June 3, 2025 • 5:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా మెడికల్‌ కాలేజీల్లో వైద్య విద్య కోర్సులైన ఎంబీబీఎస్‌ (MBBS)తోపాటు బీఏఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీఎస్‌ఎంఎస్‌ వంటి మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ 2025 (NEET UG‌) ప్రవేశ పరీక్షను మే 4వ తేదీన దేశవ్యాప్తంగా 552 కేంద్రాల్లో నిర్వహించారు. తాజాగా ప్రిలిమినరీ ఆన్సర్‌ కీ ఎన్‌టీఏ విడుదల చేసింది.పరీక్ష రాసిన అభ్యర్థులు తమ సమాధానాలను సరిచూసుకుని, ఏవైనా అభ్యంతరాలుంటే తెలియజేయడానికి అవకాశం కల్పించారు.తాజాగా విడుదల చేసిన ప్రొవిజనల్ ఆన్సర్ కీని అభ్యర్థులు NTA అధికారిక పోర్టల్ అయిన neet.nta.nic.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థుల సౌలభ్యం కోసం ఆన్సర్ కీ డౌన్‌లోడ్ చేసుకునేందుకు డైరెక్ట్ లింక్‌ను కూడా వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

ఆన్‌లైన్‌లో

ప్రొవిజనల్ ఆన్సర్ కీపై అభ్యంతరాలు ఉన్నవారు ఆన్‌లైన్‌లో తమ సవాళ్లను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను జూన్ 3వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు గడువు విధించారు.
అభ్యంతరాలు తెలిపేందుకు అభ్యర్థులు ఈ కింది పద్ధతిని అనుసరించాలి:
1. ముందుగా అధికారిక నీట్ యూజీ వెబ్‌సైట్ neet.nta.nic.in ను సందర్శించాలి.
2. హోమ్‌పేజీలో కనిపించే “డిస్‌ప్లే OMR ఆన్సర్ షీట్/ఛాలెంజ్ రికార్డెడ్ రెస్పాన్స్ అండ్ ఆన్సర్ కీ” అనే లింక్‌పై క్లిక్ చేయాలి.
3. తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో లాగిన్ అవ్వాలి.
4. తర్వాత, తాము రాసిన సమాధానాలతో కూడిన OMR షీట్లను చూడవచ్చు.
5. ఏ ప్రశ్నకైతే అభ్యంతరం చెప్పాలనుకుంటున్నారో, ఆ ప్రశ్నకు సంబంధించిన లింక్‌పై క్లిక్ చేయాలి.
6. ప్రతి అభ్యంతరానికి రూ. 200 ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించి, రశీదును డౌన్‌లోడ్ చేసుకోవాలి. 

NEET UG 2025: నీట్ 2025 ఆన్సర్ కీ విడుదల

అభ్యర్థులు

అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన తర్వాత, NTA అధికారులు అభ్యర్థులు సమర్పించిన అన్ని సవాళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఏదైనా అభ్యంతరం సరైనదని తేలితే, దానికి అనుగుణంగా నీట్ ఆన్సర్ కీని సవరిస్తారు. ఇలా ఖరారు చేసిన తుది ఆన్సర్ కీ(Final answer key) ఆధారంగా అభ్యర్థుల ఫలితాలను సిద్ధం చేస్తారు. అయితే, తమ అభ్యంతరాలు ఆమోదించబడ్డాయా లేదా అనే విషయంపై అభ్యర్థులకు వ్యక్తిగతంగా ఎలాంటి సమాచారం ఇవ్వబడదని NTA స్పష్టం చేసింది.NTA విడుదల చేసిన అధికారిక షెడ్యూల్ ప్రకారం, నీట్ యూజీ 2025 ఫలితాలు జూన్ 14వ తేదీన ప్రకటించే అవకాశం ఉంది. తాజా సమాచారం కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ను చూస్తూ ఉండాలని అధికారులు సూచించారు.

Read Also: Raja Singh: దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయండి.. బీజేపీకి రాజా సింగ్ సవాల్

#MedicalEntranceExam #NEET2025 #NEETUG2025 #ProvisionalAnswerKey Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.