📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

National Herald Case: విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారు..సోనియా-రాహుల్ పై ఈడీ ఆరోపణలు!

Author Icon By Shobha Rani
Updated: May 21, 2025 • 3:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నేషనల్ హెరాల్డ్‌ కేసు(National Herald Case) లో ED ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోవడంపై రౌస్‌ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. చార్జిషీట్‌ దాఖలు అయిన తర్వాత- ఈ కేసులో నిందితులైన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ‌, శామ్‌ పిట్రోడాకు నోటీసులు జారీచేసింది న్యాయస్థానం. ED తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు, ప్రత్యేక న్యాయవాది జోహెబ్‌ హుస్సేన్‌ వాదనలు వినిపించారు. నిందితుల తరపున అభిషేక్‌ సింఘ్వీ వాదనలు వినిపించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఆయన తల్లి, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీలు నేరపూరిత ఆస్తుల ద్వారా దాదాపు 142 కోట్లు సంపాదించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం ఢిల్లీ కోర్టుకు తెలిపింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నేషనల్ హెరాల్డ్ కేసులో ED దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకుంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, శామ్ పిట్రోడా, సుమన్ దూబే తదితరులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. సోనియా, రాహుల్‌, శామ్‌పిట్రోడా, సుమన్‌ దూబే విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారని వివరించింది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) కు రూ.50 లక్షలు చెల్లించడం ద్వారా, యంగ్ ఇండియన్ కంపెనీ రూ.90.25 కోట్లు సంపాదించిందని ఈడీ తరుపున న్యాయవాదులు వివరించారు.

National Herald Case: విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారు..సోనియా-రాహుల్ పై ఈడీ ఆరోపణలు!

కోర్టులో విచారణ ప్రారంభం
నిందితులు నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని అనుభవిస్తున్నారని ఈడీ పేర్కొంది. ఆ సంస్థ అద్దెల ద్వారా వచ్చిన రూ.142 కోట్ల ఆదాయాన్ని.. సోనియా, రాహుల్‌ వాడుకున్నారని ఈడీ పేర్కొంది. నేరపూరితంగా వచ్చిన నిధులను స్వాధీనం చేసుకోవాలని కోరింది. నేషనల్‌ హెరాల్డ్‌ ఆస్తుల నుంచి వచ్చే అద్దె కూడా నేరం ద్వారా వచ్చిందే.. నవంబర్ 2023లో ఆస్తులను అటాచ్ చేశామని ఈడీ పేర్కొంది. నేరపూరిత చర్య ద్వారా వచ్చిన ఆదాయాన్ని అనుభవిస్తుంటే.. దాన్ని మనీలాండరింగ్‌గా పరిగణించాలని కోరింది. సోనియా, రాహుల్‌ పాత్రపై ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్డుకు తెలిపింది.
ఛార్జ్‌షీట్ కాపీ స్వామికి ఇవ్వాలని ఆదేశం
ఇంతలో, ఈ కేసులో తన ఛార్జిషీట్ కాపీని బిజెపి నాయకుడు సుబ్రమణియన్ స్వామికి అందించాలని న్యాయమూర్తి EDని ఆదేశించారు. ఆయన ప్రైవేట్ ఫిర్యాదు ఆధారంగా ED ప్రస్తుత కేసును నమోదు చేసింది. ఈ కేసులో వాదనలు ప్రస్తుతం జరుగుతున్నాయి. జూన్ 26, 2014న స్వామి దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదును మేజిస్ట్రేట్ కోర్టు పరిగణనలోకి తీసుకున్న తర్వాత, ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది.. 2021లో తన దర్యాప్తును ప్రారంభించింది.

Read Also: BJP: పాక్ ఆర్మీ చీఫ్ పదోన్నతిపై మండిపడ్డ బీజేపీ

Breaking News in Telugu ED charges against Sonia-Rahul for breach of trust! Google news Google News in Telugu Latest News in Telugu National Herald Case: Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.