హైదరాబాద్ గచ్చిబౌలి సాట్స్ షూటింగ్ రేంజ్ వేదికగా జరుగుతున్న 11వ తెలంగాణ స్టేట్ షూటింగ్ చాంపియన్‌షిప్ పోటీలు ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. వివిధ వర్గాల్లో షూటర్లు తమ ప్రతిభను ప్రదర్శిస్తూ ప్రతిష్టాత్మక పతకాలను లక్ష్యంగా పోటీపడుతున్నారు. ఈ క్రమంలో మహమ్మద్ అక్రమ్ (Mohammed Akram) అనే యువ షూటర్ అద్భుత ప్రదర్శనతో పురుషుల వ్యక్తిగత క్లే పీజియన్ ట్రాప్ షూటింగ్ ఫైనల్లో స్వర్ణ పతకం సాధించి ఆకట్టుకున్నాడు.సోమవారం జరిగిన పురుషుల ట్రాప్ షూటింగ్ ఫైనల్‌లో అక్రమ్ 39 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. అతి కఠినమైన పోటీలో అత్యంత స్థిరత్వంతో, దూకుడుతో ప్రతిష్టాత్మకంగా తన ఆటను కొనసాగించాడు. ఇతర అగ్రశ్రేణి షూటర్ల (Top shooters) ను వెనక్కి నెట్టి, తెలంగాణ రాష్ట్రానికి పసిడి పతకాన్ని అందించాడు.అతని గురి స్థిరత, లక్ష్యాన్ని వేగంగా గుర్తించి తక్కువ సమయంలో రియాక్షన్ ఇవ్వగల సామర్థ్యం ప్రత్యర్థులపై మానసిక ఒత్తిడిని పెంచింది.

పతకాలు కైవసం
చివరి దాకా ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో తన ఆటపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుని విజయవంతమయ్యాడు.ఇదే విభాగంలో కయ్‌మార్జ్ (Kaymarz) (38), జోహైర్ హసన్(38) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. క్లే పీజియన్ ట్రాప్ షూటింగ్(ఎస్-19)లో అహ్మద్ ముక్తారుద్దీన్(40) స్వర్ణం సాధించాడు. పురుషుల మాస్టర్ క్లే పీజియన్ ట్రాప్ కేటగిరీలో ముజాహిద్ అలీఖాన్ (Mujahid Ali Khan) (40) పసిడి కైవసం చేసుకోగా, ఫజల్(40), చేతన్‌రెడ్డి(35) రజత, కాంస్యాలు ఖాతాలో వేసుకున్నారు.
Read Also: Joe Root: టెస్ట్ సిరీస్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన జో రూట్