Modi : ఉగ్రదాడిపై ప్రధాని మోదీ గట్టి హెచ్చరికలు: దేశం దృఢ సంకల్పంతో ఉంది
బీహార్‌లోని మధుబనిలో పంచాయతీరాజ్ దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పహల్గాం ఉగ్రదాడిపై తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలిస్తామని, ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించలేని విధంగా శిక్ష విధిస్తామని గట్టిగా హెచ్చరించారు. పర్యాటకులపై జరిగిన ఈ దాడి, భారతదేశ ఆత్మపై దాడిగా అభివర్ణించారు. ప్రతి ఉగ్రవాదిని గుర్తించి, వెంటాడి, వెన్నువిరిచే వరకు భారతదేశం వైఫల్యం చెందదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.ఈ దాడిలో మృతుల జ్ఞాపకార్థంగా సభలో ఒక్క నిమిషం మౌనం పాటించి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబాలకు దేశం అండగా ఉందని, వారి కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ చర్యలు తీసుకుంటుందని మోదీ వెల్లడించారు. ఈ ఉగ్రదాడి దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి బాధను, ఆగ్రహాన్ని కలిప్రధాని మాట్లాడుతూ ఉగ్రవాదులను మట్టుబెట్టే సమయం ఆసన్నమైందని, భారత ప్రజల ఐక్యత ఉగ్రవాదాన్ని నాశనం చేస్తుందని గట్టిగా ప్రకటించారు. ముష్కరులపై భారత సైన్యం కఠిన చర్యలు తీసుకుంటుందని, ఎక్కడ నక్కినా సరే వారిని వెతికి, శిక్షించటమే లక్ష్యమని స్పష్టం చేశారు. భారత్‌కి అండగా నిలిచిన అంతర్జాతీయ దేశాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరు భారత్‌కు మద్దతుగా నిలవడాన్ని అభినందించారు.గించిందని తెలిపారు. కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలు ఒక్కటిగా ఉన్నారని పేర్కొన్నారు.
పహల్గాం దాడిపై ప్రధాని ప్రతీకారం మాటలు
ఏప్రిల్ 22న జమ్ము కాశ్మీర్‌లోని పహల్గాంలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన సరన్ వద్ద ముష్కరులు జరిపిన దాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పర్యాటకులను చుట్టుముట్టి అతి సమీపం నుంచి కాల్పులు జరిపిన విషయం కలకలం రేపింది. దీనిపై దేశం అంతటా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితిని దేశం సమష్టిగా ఎదుర్కొంటుందనీ, ఉగ్రవాదంపై పోరాటం కొనసాగుతుందనీ ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.
Read More : CBN : నేడు ఢిల్లీకి సీఎం.. PMకు ‘అమరావతి’ ఆహ్వానం