📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Miss World 2025: నేడు మిస్ వ‌ర‌ల్డ్ ఫైన‌ల్స్..సందడి చేయనున్న బాలీవుడ్ తారలు

Author Icon By Anusha
Updated: May 31, 2025 • 12:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ లో మిస్ వరల్డ్ ఫైనల్స్‌ తుది దశకు చేరుకున్నాయి.మూడు వారాలుగా ఉత్కంఠభరితంగా సాగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు(Miss World 2025 Competitions)కొన్ని గంటల వ్యవధిలోనే విజేత ఎవరో తెలనుంది. మిస్ వరల్డ్ పోటీల గ్రాండ్ ఫైనల్ కోసంహైదరాబాద్ హైటెక్స్‌లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫైనల్ నిర్వహణకు సర్వం సిద్ధం అయినట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 6-30గంటలకు కార్యక్రమం ప్రారంభమై 9-20గంటలకు ముగియ‌నుంద‌ని తెలుస్తుంది.దాదాపు 3500 మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. విద్యుత్ కాంతులతో శోభాయమానంగా వెలిగిపోతూ ఈ మెగా ఈవెంట్‌కు వేదిక సిద్ధంగా ఉంది. అయితే ఫైనల్స్‌లో ఎవరు కిరీటాన్ని గెలుచుకుంటారో అని ప్రపంచం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

ఛైర్‌పర్సన్

ఈ మెగా ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో లైవ్ టెలికాస్ట్ కానుండడం విశేషం.ఈ కార్య‌క్ర‌మానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఈ సారి మిస్‌వరల్డ్ విజేతకు రూ.8.5 కోట్ల ప్రైజ్‌ మనీ లభిస్తుంది.మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు సుమారు 110కి పైగా దేశాల నుంచి సుందరీమణులు తరలి రాగా, వీరిలో గ్రాండ్ ఫినాలేకు 40 మంది కంటెస్టెంట్లు ఎంపికయ్యారు. వీరిలో నుంచి ఒక్కరు మిస్ వరల్డ్ కిరీటం(Miss World crown) అందుకోనున్నారు. మిస్ వరల్డ్ ఛైర్‌పర్సన్ జూలియా మోర్లే ఈ ప్రతిష్టాత్మక జ్యూరీకి నేతృత్వం వహిస్తుండ‌గా, జ్యూరీ సభ్యులుగా బాలీవుడ్ నటుడు సోనూ సూద్, ప్రముఖ ఆంత్రప్రెన్యూర్‌ సుధా రెడ్డి, 2014 మిస్ ఇంగ్లాండ్ కెరినా టిర్రెల్ వ్యవహరించ‌నున్నారు.సోనూ సూద్ కి మిస్‌వరల్డ్‌ హ్యుమానిటేరియన్‌ అవార్డు(Humanitarian Award)ను అందజేయనున్నారు.

Miss World 2025: నేడు మిస్ వ‌ర‌ల్డ్ ఫైన‌ల్స్..సందడి చేయనున్న బాలీవుడ్ తారలు

అతిథులు

ఈ మెగా ఈవెంట్ కి బాలీవుడ్ స్టార్లు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖట్టర్ తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. మానుషి చిల్లర్ (2017 మిస్ వరల్డ్), స్టెఫానీ డెల్ (2016 మిస్ వరల్డ్) ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా హాజరవుతున్నారు. ప్రెజెంటర్‌గా సచిన్ కుంభార్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కాగా, కంటెస్టెంట్లకు మే 24న మిస్ వరల్డ్ టాప్ మోడల్ అండ్ ఫ్యాషన్ ఫినాలే పోటీ(Model and Fashion Finale Competition) నిర్వహించారు. అలానే మే 25న జ్యుయలరీ / పెర్ల్ ఫ్యాషన్ షో, మే 26న “బ్యూటీ విత్ ఎ పర్పస్”,గాలా నైట్ , గాలా డిన్నర్ (బ్రిటిష్ రెసిడెన్సీ/తాజ్ ఫలక్‌నుమాలో) నిర్వహించారు.

Read Also: Kavitha: కవిత పార్టీ మారడంపై స్పందించిన కేశవరావు

#CarinaTyrrell #GrandFinale #MissWorld2025 #RevanthReddy #SonuSood #SudhaReddy Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.