📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

ర్యాగింగ్ పేరుతో వికృత చేష్టలు

Author Icon By Vanipushpa
Updated: February 12, 2025 • 3:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ర్యాగింగ్ పేరుతో జూనియర్ల పట్ల సీనియర్ల అత్యంత క్రూరంగా వ్యవహరించారు. వారిని నగ్నంగా మార్చి.. ప్రయివేట్ పార్ట్స్‌కు డంబెల్స్ వేలాడదీసి, జామెట్రీ బాక్సులోని కంపాస్‌తో పొడిచి పైశాచిక ఆనందం అనుభవించారు. ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా మూడు నెలల పాటు వికృత చర్యలతో జూనియర్లను హింసించి నరకం చూపించారు. శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసిన అత్యంత భయానక ఈ ఘటన కేరళలోని ఓ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి దాష్టీకం బయటపడింది.

విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులు
కొట్టాయంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో మొదటి ఏడాది విద్యార్థులను ర్యాగింగ్ పేరుతో హింసించిన ఐదుగురు థర్డ్ ఇయర్ స్టూడెంట్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరువనంతపురానికి చెందిన జూనియర్ విద్యార్థులు కొట్టాయం గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గత నవంబరు నుంచి సీనియర్ల తమను చిత్రహింసలకు గురిచేశారని వాపోయారు. బలవంతంగా బట్టలు విప్పదీయించి, మర్మాంగాలకు డంబెల్స్ కట్టి వికృత ఆనందం పొందారని కన్నీళ్లు పెట్టుకున్నారు.

యావత్ దేశాన్ని కుదిపేసిన సంఘటన

గత నెల కేరళలో 15 ఏళ్ల మిహిర్ అహ్మద్ ఆత్మహత్య యావత్ దేశాన్ని కుదిపేసింది. తాము ఉంటోన్న అపార్ట్‌మెంట్ భవనం 26వ అంతస్తులోని ఫైర్‌ ఎగ్జిట్‌ విండో నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఆ బాలుడు ప్రాణాలు పోవడానికి తోటి విద్యార్థుల ర్యాగింగ్ కారణం. తాజాగా, కేరళలో అలాంటి మరో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. జూనియర్లపై సీనియర్ల దాష్టీకానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మద్యం కోసం జూనియర్ల నుంచి డబ్బులు

వారి క్రూరత్వం అక్కడితో ఆగలేదు. జామెట్రీ బాక్సులో కాంపాస్ సహా పదునైన వస్తువులతోనూ రక్తం వచ్చేలా గుచ్చి ఆయ గాయాలకు లోషన్ రాసి హింసించారు. బాధితులు బాధతో కేకలు వేస్తుంటే, లోషన్‌ను బలవంతంగా వారి నోటిలోకి పూసేవారు. ఈ దుశ్చర్యలను వీడియో తీసి, ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారు. ప్రతి ఆదివారం మద్యం పార్టీల కోసం జూనియర్ల నుంచి డబ్బులు లాక్కునేవారు. ఎవరైనా ఎదురుతిరిగితే దారుణంగా కొట్టేవారు. వారి ఆగడాలను తట్టుకోలేకపోయిన ఓ విద్యార్థి తన తండ్రికి చెప్పడంతో ఆయన సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మూడు నెలల పాటు వాటి ఆగడాలను మౌనంగా భరించిన విద్యార్థులు.. శ్రుతిమించడంతో చివరకు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో యాంటీ ర్యాగింగ్ చట్టం కింద కేసు నమోదుచేసి.. ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న నిందితులు.. మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Kerala Latest News in Telugu medical collage Mischievous acts Paper Telugu News ragging Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.