📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Meghalaya Murder: దేవుడా! సోనమ్ చేతిలో నుండి నన్ను రక్షించినందుకు థాంక్స్.. ఏంటి ఆ కథ

Author Icon By Anusha
Updated: June 19, 2025 • 5:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజా రఘువంశీ హత్యకేసు రోజురోజుకీ కొత్త మలుపులు తిరుగుతోంది. హనీమూన్‌ సందర్భంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని ఘాటు ప్రాంతానికి వెళ్లిన రఘువంశీ, అతని భార్య సోనమ్ (Sonam) మధ్య జరిగిన ఘర్షణ, అనంతరం జరిగిన దారుణం తెలిసిందే. ఇప్పటికీ ఈ కేసు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ కేసుతో సంబంధించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని ధార్‌కు చెందిన మయాంక్ అనే వ్యాపారవేత్త ఈ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

వివాహం చేసుకోవడానికి

సోనమ్ ఆమె తన ప్రియుడి కోసం కట్టుకున్న భర్తని అత్యంత దారుణంగా హత్య చేసి జైలు పాలైంది. ఆమె చేసిన పని చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. నిజానికి సోనమ్ తన ప్రియుడిని వివాహం చేసుకోవడానికి పెళ్లైన కొన్ని రోజులకే భర్తని హత్య చేసింది. ఈ హత్యకు సూత్రధారి సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా (Raj Kushwaha).ఈ కేసులో మొత్తం ఐదుగురుని అరెస్టు చేశారు. సోనమ్ చేసిన హత్య, ప్రేమికుడిని పెళ్లి చేసుకోవడానికి దారుణంగా భర్తని హత్యచేయించింది.

వ్యాపారవేత్త

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాకు చెందిన సోనమ్ కి ఒక పెళ్లి ప్రతిపాదన వచ్చింది. ఈ కుటుంబం ఒక వ్యాపారవేత్తది. ఈ ప్రతిపాదన నానేవాడిలో నివసిస్తున్న వ్యాపారవేత్త హరీష్ కుమారుడు మయాంక్ ది. మయాంక్ మామ సోనమ్ (Sonam) గురించి చెప్పి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆ తర్వాత రెండు కుటుంబాల మధ్య పెళ్లి చేసే విషయంలో మరింత ముందుకు వెళ్ళారు.రెండు కుటుంబాలు కలిశాయి. తర్వాత గణాలు జత కలిశాయి. మయాంక్ , సోనమ్‌లకు 25 సరిపోలిక గణాలు ఉన్నాయి. దీనితో ఇరువురి కుటుంబ సభ్యులు సంతోషంగా ఇద్దరి వివాహ తేదీని కూడా నిర్ణయించారు.

Meghalaya Murder

మయాంక్ కుటుంబానికి

అయితే ఈ లోగా వరుడి కుటుంబ సభ్యులు సోనమ్ మయాంక్ కుండలిని తమకు తెలిసిన జ్యోతిష్కుడికి చూపించారు. అప్పుడు మయాంక్ (Mayank) జ్యోతిష్కుడు వీరికి పెళ్లి చేస్తే ఈ సంబంధం ఎక్కువ కాలం ఉండదు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరగవచ్చు. దీని వల్ల మీ కుటుంబం మొత్తం బాధపడుతుంది అని మయాంక్ కుటుంబానికి చెప్పాడు. అంతేకాదు ఈ పెళ్లి జరిగితే ఈ సంబంధం మిమ్మల్ని తీవ్రమైన పరిస్థితిలో పడేస్తుందని హెచ్చరించాడు.

దేవుడి దయవల్ల నేను బతికాను

జ్యోతిష్కుడు చెప్పిన విషయాలు విన్న మయాంక్ , అతని కుటుంబం దిగ్భ్రాంతి చెందారు. వారు చాలా ఆలోచించి ఆ సంబంధం వద్దని తిరస్కరించారు. మయాంక్ ఫ్యామిలీ (Mayank Family) పెళ్ళికి నో చెప్పిన తరువాత సోనమ్ కి రాజాకి ఫిబ్రవరిలో సోనమ్ నిశ్చితార్థం జరిగింది. పెళ్లి తర్వాత రాజా (Raja Raghuvanshi) విషయంలో ఏమి జరిగిందో అందరికీ తెలిసిందే.రాజా రఘువంశీ హత్య కేసులో సోనమ్ రఘువంశీ ప్రమేయం ఉందని తెలుసుకున్న మయాంక్ షాక్ అయ్యాడు. అతను ఇలా అన్నాడు దేవుడి దయవల్ల నేను బతికాను. లేకుంటే నేను ఈరోజు రాజా స్థానంలో ఉండేవాడిని. జ్యోతిష్కుడు నన్ను కాపాడాడు. అయితే రాజా కుటుంబానికి న్యాయం జరగాలని తాను కోరుకుంటున్నానని చెప్పాడు.

Read Also: Amit Shah: త్వరలో ఇంగ్లీష్ మాట్లాడేవారంతా సిగ్గుపడతారన్న అమిత్ షా

#JyotishPrediction #Mayank Raghuvanshi #Sonam #ThankfulHeart Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.