📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Meghalaya Murder: హనీ మూన్ మర్డర్ కేసులో పట్టించిన మంగళసూత్రం

Author Icon By Anusha
Updated: June 13, 2025 • 3:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. ఇటీవల పెళ్లయిన రాజా రఘువంశీ (29), సోనమ్ (25) జంట మేఘాలయకు హనీమూన్ కోసం వెళ్లిన కొన్ని రోజులకే, భర్త హత్యకు గురవడం, భార్య అదృశ్యమవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. పెళ్లి పేరిట సొంత భార్య తన భర్తను కిరాతకంగా హత్య చేయించడం విస్తుగొలిపేలా ఉంది. అయితే ఈ కేసులో తాజాగా మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. హనీమూన్‌ కోసం మేఘాలయకు వెళ్లిన రాజా రఘువంశీ (29), సోనమ్‌ (25) జంట అనూహ్య రీతిలో అదృశ్యమయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లకు రాజా రఘువంశీ డెడ్‌బాడీ అనుమానాస్పద స్థితిలో దొరకడం, సోనమ్ కనిపించకపోవడంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో నిందితులు అన్నీ పక్కాగా ప్లాన్ చేశారు. కానీ దర్యాప్తులో భాగంగా పోలీసులు ఈ జంట స్టే చేసిన హోటల్‌కి వెళ్లడంతో అక్కడ దొరికిన క్లూ అన్ని అనుమానాలకు సమాధానంగా మారింది. 

నిందితురాలిని

ఈ జంట బసచేసిన హోటల్‌ గదిలో ఒక సూట్‌కేసులో మంగళసూత్రం, ఉంగరం లభించాయి. కొత్తగా పెళ్లైన సోనమ్‌ (Sonam) హనీమూన్‌ సమయంలో మంగళసూత్రం గదిలో వదిలి వెళ్లడం పోలీసుల బుర్రకు పనిచెప్పినట్లైంది. ఆ మంగళసూత్రమే ఆ తర్వాత దర్యాప్తులో నిందితురాలిని పట్టించాయని పోలీసులు తెలిపారు. ఈ కోణంలోనే దర్యాప్తును ముమ్మరం చేశామని, అప్పుడే అసలు నిందితురాలు సోనమ్‌గా తేలిందని పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా నేరాన్ని అంగీకరించారని వెల్లడించారు.ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్లతో భర్తను హత్య చేయించినట్లు నిందితురాలు పోలీసుల ఎదుట అంగీకరించింది.

Meghalaya Murder

పోలీసు అధికారి

మరో నిందితుడు ఇండోర్ నివాసి అయిన రాజ్ కుష్వాహా అని, అతడు సోనమ్‌ ప్రేమికుడని తేలింది. నిందితులు విచారణలో నేరాన్ని అంగీకరించినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు.మరోవైపు మే 23న మరో హోమ్‌స్టేలో కాపుగాచి కాంట్రాక్ట్ కిల్లర్లు (Contract killers) ఉన్నారు. దీంతో సోనమ్ ఫోటోలు తీసుకునే నెపంతో రాజాను హోమ్ స్టే నుంచి బయటకు తీసుకొచ్చింది.అక్కడ ఆమె ఫోటోలు తీస్తున్నట్లు నటిస్తూ దూరంగా నిలబడి ఉంది. ఇంతలో కాంట్రాక్ట్ కిల్లర్‌లు వెనుక నుంచి రాజా రఘువంశీ (Raja Raghuvanshi) ని అంతమొందించారని పోలీసు అధికారి మారక్ కేసు వివరాలను మీడియాకు తెలిపారు. హంతకులు రెండు స్కూటీలను వినియోగించగా ఘటన అనంతరం సోనమ్ ఒక నిందితుడి స్కూటీపై పరారైంది. మిగిలిన ఇద్దరు నిందితులు మరో స్కూటీలో వెళ్లిపోయినట్లు తెలిపారు.

Read Also: Vijay Rupani: విజయ్ రూపానీ మృతి ప‌ట్ల‌ సంతాపం వ్యక్తం చేసిన పవన్

#HoneymoonMurderCase #MeghalayaMurder #RajaRaghuvanshi #SonamMurderPlot Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.