Lok Sabha Speaker: మార్చి 9న స్పీకర్ తొలగింపు తీర్మానంపై చర్చ

Read Time:  1 min
Lok Sabha Speaker: మార్చి 9న స్పీకర్ తొలగింపు తీర్మానంపై చర్చ
FONT SIZE
GET APP

Lok Sabha Speaker: లోక్‌సభ స్పీకర్‌ను తొలగించే అవిశ్వాస తీర్మానం దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది. ఈ అంశంపై మార్చి 9న చర్చ జరగనుందని, ఆ తర్వాత ఓటింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల రెండో విడత మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు ఉంటుందని, ఈ సెషన్‌లో పలు కీలక బిల్లులు చర్చకు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు నిరసనలు చేస్తే వారికే నష్టమని, సభ జరగనివ్వకపోతే గిలటిన్ పద్ధతిలో ముందుకు వెళ్తామని రిజిజు అన్నారు.

Read Also: ViksitBharat2047: వాణిజ్య ఒప్పందాలతో కొత్త ఆర్థిక యుగం

Lok Sabha Speaker: Discussion on the motion to remove the Speaker on March 9
Lok Sabha Speaker: Discussion on the motion to remove the Speaker on March 9

ప్రతిపక్షాలలో ఐక్యత లేదు

పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, అసోం, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీకి ఏప్రిల్లో ఎన్నికలు జరగనున్నాయని గుర్తుచేశారు. కీలకమైన బిల్లు సహా ముఖ్యమైన బిల్లులు తెచ్చి వాటన్నిటినీ ఆమోదింపజేసుకుంటామని తెలిపారు.చర్చలో పాల్గొనకుంటే విపక్షాలకే నష్టమని పునరుద్ఘాటించారు. విపక్షాల మధ్య ఐక్యత లేదన్నారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానంపై టీఎంసీ సంతకం చేయలేదని గుర్తుచేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.