📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు

LIC:ఎల్‌ఐసీ రిక్రూట్‌మెంట్ 2025 .. డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు

Author Icon By Anusha
Updated: June 23, 2025 • 6:12 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్ఎల్‌ (LIC HfL) దేశ వ్యాప్తంగా వివిధ బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి సంబంధించి 2025 సంవత్సరం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారికంగా కోరింది.ఈ నోటిఫికేషన్‌ దేశ వ్యాప్తంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న డిగ్రీ అభ్యర్థులకు (degree candidates) మంచి అవకాశం.ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు.అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు గడువు జూన్‌ 28, 2025వ తేదీతో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు గడువు సమయం ముగిసేలోపు అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 250 అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో ఏపీలో 20, తెలంగాణలో 24 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 2025, జూన్‌ 1 నాటికి డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే అభ్యర్థుల వయోపరిమితి 20 సంవత్సరాలు నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. రిజర్వ్‌డ్ వర్గాలకు (reserved categories) గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్/ఓబీసీ అభ్యర్ధులు రూ. 944, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ. 708 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ. 472 ఫీజు చెల్లించాలి.

LIC

ఆన్‌లైన్ పరీక్ష

రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక జరుగుతుంది. ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష జూలై 3, 2025న నిర్వహిస్తారు. ఎంపికైన వారికి ఏడాది పాటు అప్రెంటీస్‌ ట్రైనింగ్‌ (Apprentice training) ఇస్తారు. ఈ ఏడాది కాలంలో ప్రతి నెలకు రూ.12,000 చొప్పున స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా చెక్‌ చేసుకోండి.

Read Also: Hyderabad: అమెజాన్‌ ఎట్‌హోమ్‌ డయాగ్నోస్టిక్స్‌ హైదరాబాద్‌లో

#ApprenticeVacancy #GovernmentJobsIndia #HCLApprenticeJobs #LICRecruitment2025 Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.