📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Madras High Court – మూడో కాన్పుకు కూడా మెటర్నిటీ లీవ్స్ ఇవ్వాల్సిందే

Author Icon By Anusha
Updated: September 6, 2025 • 11:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహిళల హక్కులు, వారి ఆరోగ్య పరిరక్షణ, శిశు సంక్షేమం కోసం భారతదేశంలో అనేక చట్టాలు అమల్లో ఉన్నాయి. వాటిలో ప్రసూతి ప్రయోజన చట్టం – 1961 (Maternity Benefit Act) ముఖ్యమైనది. ఈ చట్టం ప్రకారం, గర్భిణీ స్త్రీలకు ప్రసూతి ముందు, ప్రసూతి తరువాత కొన్ని రోజుల పాటు చెల్లింపు సెలవులు ఇవ్వడం తప్పనిసరి. కానీ ఇప్పటివరకు అనేక చోట్ల ఈ చట్టాన్ని సరైన రీతిలో అమలు చేయకపోవడం వల్ల మహిళలు నష్టపోతున్నారు.

తాజాగా మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఈ విషయంలో కీలక మలుపు తీసుకొచ్చింది. మూడోసారి గర్భం దాల్చినందుకు ఒక మహిళకు ప్రసూతి సెలవును నిరాకరిస్తూ అదనపు మున్సిఫ్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వును రద్దు చేసింది. అలాగే ప్రసూతి ప్రయోజనాలు కేవలం ఒకటో లేదా రెండో కాన్పుకే పరిమితం కాదని.. అవి తల్లి సంక్షేమం కోసం ఉద్దేశించినవని కోర్టు తెలిపింది. మూడో కాన్పుకు కూడా కచ్చితంగా ప్రసూతి సెలవులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.

తీర్పు నేపథ్యం

తమిళనాడులోని ఉలుందుర్‌పేట్ అదనపు మున్సిఫ్ కోర్టులో.. బి రంజిత జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలు ఉండగా.. ఇటీవలే మూడోసారి గర్భం దాల్చింది. దీంతో ఆమె తన మూడో కాన్పు కోసం 2025 ఆగస్టు 18వ తేదీ నుంచి 2026 ఆగస్టు 17వ తేదీ అంటే ఏడాది వరకు ప్రసూతి సెలవు కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రసూతి సెలవులు మొదటి రెండు కాన్పులకు మాత్రమే వర్తిస్తాయని చెబుతూ.. జిల్లా న్యాయమూర్తి ఆమె దరఖాస్తును తిరస్కరించారు.

దీంతో జిల్లా న్యాయమూర్తి ఉత్తర్వును సవాల్ చేస్తూ రంజిత మద్రాసు హైకోర్టు (Madras High Court) ను ఆశ్రయించారు.ఈక్రమంలోనే శుక్రవారం రోజు జస్టిస్ సురేశ్ కుమార్, జస్టిస్ హేమంత్ చందన్‌గౌదర్ ధర్మాసనం విచారణ జరిపింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తులు.. ప్రసూతి ప్రయోజనాలను నిరాకరించడం పూర్తిగా అసంబద్ధమైనదని, అమానవీయమని పేర్కొన్నారు. ఒక మహిళకు మూడో కాన్పుకు ప్రసూతి సెలవును తిరస్కరించడానికి ఎలాంటి సహేతుకమైన కారణం లేదని స్పష్టం చేస్తూ.. సంచలన తీర్పును వెలువరించారు. ముఖ్యంగా ప్రసూతి సెలవులు బహుమానం కాదని.. అవి మహిళలకు ఉన్న ఒక ప్రాథమిక హక్కు అని న్యాయస్థానం ఉద్ఘాటించింది.

Latest News

సమాజం యొక్క శ్రేయస్సు కోసం

ఈ హక్కు బిడ్డల సంఖ్యపై ఆధారపడి ఉండదని.. తల్లి శారీరక, మానసిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది. ఒక మహిళ తల్లి అయిన తర్వాత బిడ్డ ఆలనా పాలనా చూసుకోవడానికి ఆమెకు సెలవు అవసరమని కోర్టు అభిప్రాయపడింది. ప్రసూతి ప్రయోజనాలు స్త్రీల ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు, సమాజం యొక్క శ్రేయస్సు కోసం ఉద్దేశించబడ్డాయని న్యాయమూర్తి చెప్పుకొచ్చారు.అతేకాకుండా విధుల్లో చేరకముందే ఇద్దరు పిల్లలు ఉండి మూడోసారి గర్భం దాల్చి విధుల్లో చేరిన మహిళకు ప్రసూతి సలవులు ఇవ్వాలన్న సుప్రీం కోర్టు ఉత్తర్వులను పేర్కొంటూ.. రంజితకు చట్ట ప్రకారం ప్రసూతి సెలవులు ఇవ్వాలని ఉలుందుర్‌పేట్ మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తిని ఆదేశించారు.

Read hindi news : hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-n-srinivasan-n-srinivasan-takes-charge-as-csk-chairman/sports/542289/

Breaking News Indian Judiciary Landmark judgment latest news Madras High Court maternal welfare maternity leave motherhood benefits Telugu News third child Women Rights

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.