Big Alert : రైల్వే స్టేషన్లలో క్యూ లైన్ల ఇబ్బంది లేకుండా అన్‌రిజర్వ్‌డ్ (సాధారణ) టికెట్లను బుక్ చేసుకునేందుకు ఇండియన్ రైల్వే ప్రవేశపెట్టిన ‘రైల్ వన్ / యుటిఎస్’ (UTS) యాప్ వాడుతున్న ప్రయాణికులకు రైల్వే శాఖ ఒక ముఖ్యమైన అలర్ట్ జారీ చేసింది. యాప్ ద్వారా బుక్ చేసిన టికెట్లను ప్రయాణ సమయంలో టీటీఈ (TTE) తనిఖీ చేసేటప్పుడు, ఖచ్చితంగా అదే యాప్‌లోని ‘షో టికెట్’ (Show Ticket) ఆప్షన్ ద్వారానే చూపించాలని స్పష్టం చేసింది. చాలామంది ప్రయాణికులు టికెట్ బుక్ చేసిన తర్వాత దాన్ని స్క్రీన్‌షాట్ తీయడం, ఫోటోలు కొట్టడం లేదా పీడీఎఫ్ (PDF) రూపంలో మార్చి వాట్సాప్‌లలో ఇతరులకు ఫార్వర్డ్ చేసి వాడుతున్నారు. అయితే ఇకపై ఇలాంటి స్క్రీన్‌షాట్లు, వాట్సాప్ మెసేజ్‌లు, ఫోటోలు ఎంతమాత్రం చెల్లుబాటు కావని, వాటిని టికెట్‌గా పరిగణించబోమని రైల్వే అధికారులు తేల్చి చెప్పారు.
Read Also ; రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో సరికొత్త ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్!

నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా తప్పదు
ఇటీవల కోర్బా-విశాఖపట్నం లింక్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన ఒక ఉదంతాన్ని ఉదాహరణగా చూపుతూ రైల్వే శాఖ ఈ హెచ్చరికలు జారీ చేసింది. సదరు రైలులో ప్రయాణిస్తున్న ఒక మహిళా ప్రయాణికురాలు తనిఖీ సమయంలో టీటీఈకి వాట్సాప్‌లో వచ్చిన టికెట్ ఫోటోను చూపించారు. అయితే అధికారులు లోతుగా పరిశీలించగా, ఆ టికెట్‌ను రైలు స్టేషన్ నుండి బయలుదేరిన తర్వాత (యాప్ దుర్వినియోగం చేస్తూ) బుక్ చేసినట్లు ఆధారాలతో సహా పట్టుబడింది. దీంతో సదరు మహిళకు రైల్వే నిబంధనల ప్రకారం భారీ జరిమానా (Fine) విధించారు. రైలు ఎక్కకముందే యాప్‌లో ఒరిజినల్ టికెట్ కలిగి ఉండాలని, మోసాలకు తావులేకుండా ఉండేందుకే ఈ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. యాప్ లోపల కాకుండా బయట చూపించే ఏ రకమైన డిజిటల్ కాపీ అయినా సరే.. మిమ్మల్ని ‘టికెట్ లేని ప్రయాణికుడు’ (Ticketless Traveler) గానే గుర్తిస్తారని రైల్వే శాఖ ప్రయాణికులను అప్రమత్తం చేసింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
Korean Kanakaraju : ‘కొరియన్ కనకరాజు’ రిలీజ్ డేట్ ఖరారు !
Korean Kanakaraju : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘కొరియన్ కనకరాజు’ విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న అత్యంత ఘనంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ మార్క్ వినోదంతో, ఇండో-కొరియన్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక వినూత్న హారర్ కామెడీగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో వరుణ్ తేజ్ సరసన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ ఫేమ్ రితికా నాయక్ కథానాయికగా నటిస్తోంది. వైవిధ్యమైన కథాంశంతో వస్తున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో తమన్ మ్యూజికల్ మ్యాజిక్
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ ‘యూవీ క్రియేషన్స్’ (UV Creations) భారీ బడ్జెట్‌తో, ఎక్కడా రాజీ పడకుండా నిర్మించింది. టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చడం విశేషం. ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ ఈ హారర్ కామెడీకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. వరుణ్ తేజ్ గతంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘మట్కా’ చిత్రంలో డిఫరెంట్ లుక్స్‌తో అలరించగా, ఈసారి కంప్లీట్ డిఫరెంట్ జోనర్ అయిన ఇండో-కొరియన్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తుండటం సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.