📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం

Operation Sindoor: ఉగ్రదాడుల వేళ కేంద్రం కీలక ప్రకటన

Author Icon By Anusha
Updated: May 10, 2025 • 6:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సరిహద్దుల నుంచి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని భారత్ ఇప్పటికే పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. భారత్ పై పాకిస్తాన్ చేస్తున్న దాడుల నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటనచేసింది. ఇక నుంచి భారత్‌పై ఎలాంటి ఉగ్రదాడి జరిగినా దాన్ని యుద్ధ చర్యగానే పరిగణిస్తామని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇలాంటి యుద్ధ చర్యలకు భారత త్రివిధ దళాలు దీటుగా ప్రతిస్పందిస్తాయని తీవ్ర హెచ్చరికలు(Warnings) జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే సరిహద్దు ఉగ్రవాదంపై భారత్ తన వైఖరిని కఠినతరం చేసినట్లు అర్థం అవుతోంది. ఇక నుంచి భారత భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగే ఏ ఉగ్రదాడినైనా యుద్ధంగానే పరిగణిస్తామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.పహల్గామ్ ఉగ్రదాడి దానికి కౌంటర్‌గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన సంగతి తెలిసిందే. అయితే ఆపరేషన్ సిందూర్‌తో షాక్‌కు గురైన పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి విరుచుకుపడుతోంది. ఒకవైపు నియంత్రణ రేఖ(Control line) వద్ద పాకిస్తాన్ రేంజర్లు విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతున్నారు. పౌరులు, ఆస్పత్రులు, స్కూళ్లు, కాలేజీలు అనే తేడా లేకుండా భీకర కాల్పులకు తెగబడుతున్నారు. మరోవైపు డ్రోన్లు, క్షిపణులతో గగనతలంలో భీకర దాడులకు దిగుతున్నారు. అయితే భూమి, ఆకాశంలో పాకిస్తాన్ చేస్తున్న దాడులను భారత్ అత్యంత సమర్థవంతంగా తిప్పికొట్టి పాక్‌కే గట్టి బుద్ధి చెబుతోంది.

ఉగ్రదాడుల వేళ కేంద్రం కీలక ప్రకటన

సంకేతం

గత మూడు రోజులుగా రాత్రి సమయాల్లో ఉత్తర భారతదేశంలోని పలు సైనిక స్థావరాలు, పౌర నివాసిత ప్రాంతాలపై పాకిస్థాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడులకు తెగబడుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరిక ప్రాధాన్యతను సంతరించుకుంది.సరిహద్దుల వద్ద నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం(Central Government) ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఉగ్రవాదులు ఎలాంటి దుస్సాహసానికి ఒడిగట్టినా అది నేరుగా భారత్‌పై చేసిన యుద్ధంగానే భావిస్తామని తేల్చి చెప్పింది. అలాంటి వారికి తగిన స్థాయిలో సైనిక చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తేల్చి చెప్పాయి. ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం ద్వారా ఉగ్రవాద సంస్థలకు, వాటికి మద్దతు ఇస్తున్న దేశాలకు భారత్ బలమైన సంకేతం పంపినట్లు అయింది. భారతదేశ సార్వభౌమత్వాన్ని(India sovereignty), భద్రతను కాపాడేందుకు ప్రభుత్వం ఎంతటి కఠిన చర్యలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉందనే సందేశాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. భారత్‌- పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమైన వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కొన్ని గంటల ముందే జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ కూడా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.

Read Also :Operation Sindoor: పాకిస్తాన్ దాడి చేస్తే భారత్ ఏమాత్రం వెనక్కి తగ్గదు :అసదుద్దీన్ ఒవైసీ

#bordersecurity #CounterTerrorism #indianarmy #IndiaPakistanTensions #NationalSecurity Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Operation Sindoor Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.