📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Karnataka: కర్నాటకలో బైక్‌ ట్యాక్సీ సర్వీసులు బంద్‌

Author Icon By Anusha
Updated: June 17, 2025 • 11:11 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మనం ఎక్కడికైనా ప్రయాణించాలంటే ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి వాటిలో ట్యాక్సీలు బుక్ చేసుకుంటాం. అయితే ఒక్కరమే ఉంటే బైక్ ట్యాక్సీని ఆశ్రయిస్తాం. ఇలా ఒక్కరే ఉన్నపుడు బైక్ ట్యాక్సీల్లో వెళ్తే ట్రాఫిక్‌లో సమయం ఆదా కావడమే కాకుండా చాలా తక్కువ ఖర్చుతోనే గమ్యాన్ని చేరుకోవచ్చు.చాలా నగరాల్లో నిత్యం బైక్ ట్యాక్సీల్లో లక్షలాది మంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అలాంటి వారికి పెద్ద షాక్ తగలనుంది.బైకులను కమర్షియల్ ట్రాన్స్‌పోర్టు వెహికల్స్‌గా ఉపయోగించవద్దని, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం (Karnataka State Government) ఇటీవలె సంచలన నిర్ణయం తీసుకుని బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

తీవ్ర ఇబ్బందులు

ఈ నిర్ణయం బైక్‌ ట్యాక్సీలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నవారికి భారీ షాక్‌ తగిలింది. రోజూ షిఫ్ట్‌లలో పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్న చిరుద్యోగులు, నిరుద్యోగ యువత బతుకుదెరువు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగాల లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ సేవలు వారికి ఉపాధిగా మారినప్పటికీ ఇప్పుడు అదే దారిని మూసేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.ఇక ప్రయాణికుల విషయంలో కూడా తీవ్ర ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంది. ట్రాఫిక్‌తో సతమతమవుతున్న బెంగళూరులో బైక్‌ ట్యాక్సీలు ఎంతో మందికి వేగవంతమైన, చౌక ప్రయాణ మార్గంగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా మిడిల్‌ క్లాస్‌, కాలేజీ విద్యార్థులు, మహిళలు వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇప్పుడు ఈ సేవలు నిలిపివేతతో వారు ఆఫీసులకు, కాలేజీలకు చేరడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

సేవలను నిలిపివేస్తున్నట్లు

బెంగళూరుతో సహా కర్నాటకవ్యాప్తంగా బైక్‌ ట్యాక్సీ సేవలు నిలిచిపోయాయి. ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ర్యాపిడో, ఉబర్‌, ఓలా సంస్థలు తమ సేవలను నిలిపివేశాయి. హైకోర్టు ఆదేశానుసారం తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ర్యాపిడో పేర్కొంది. సేవలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని తెలిపింది. బైక్‌ ట్యాక్సీ సేవలను ఉబర్‌, మోటో కొరియర్‌ కింద మార్చగా ఓలా తన యాప్‌లో బైక్‌ ట్యాక్సీ అనే ఆప్షన్‌ను పూర్తిగా తొలగించింది. మోటార్‌ వెహికల్‌ చట్టం (Motor Vehicle Act) లో బైక్ ట్యాక్సీల ప్రస్తావన లేదు. దీంతో బైక్‌ ట్యాక్సీ సేవలను నిలిపివేయాలని కర్నాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్‌ బెంచ్‌ సమర్థించింది. ఇక జూన్‌ 20లోగా దీనిపై స్పందన తెలియజేయాలని కర్నాటక ప్రభుత్వాన్ని అక్కడి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూన్‌ 24కు వాయిదా వేసింది.బైక్‌ ట్యాక్సీ సేవలకు కోర్టు సడెన్‌ బ్రేకులు వేయడంతో లక్షా ఇరవై వేల మంది బైక్‌ ట్యాక్సీ రైడర్లు రోడ్డున పడ్డారు.

Karnataka

హర్షం వ్యక్తం

వాళ్లు ఉపాధిని కోల్పోయారు. కమర్షియల్ ప్లేట్ లేకుండా బైక్‌లు నడపడం పైనే ప్రధానంగా అభ్యంతరాలు వచ్చాయి. కోర్టు ఆదేశాలతో బైక్ ట్యాక్సీలను పోలీసులు ఆపేశారు. దీనిపై ఆటోలు, క్యాబ్‌ డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే లక్షలాదిమంది ఉపాధి పోతోందని బైకర్లు వాపోతున్నారు. విద్యార్థులు, పార్ట్‌టైమ్ జాబ్ (Part-time job) చేసుకునేవాళ్ల ఆదాయానికి గండి పడింది. ఇక ఆటోలు, క్యాబ్‌ల కిరాయిలు భరించలేని పేద, మధ్యతరగతి జనానికి బైక్‌ ట్యాక్సీలు అందుబాటు ధరల్లో రవాణా సౌకర్యం కల్పిస్తున్నాయి. దీంతో ఆయా వర్గాల ప్రజల నెత్తిన పిడుగు పడినట్లయింది. దీంతో గిగ్‌ వర్కర్లు ఉపాధిని కోల్పోకుండా చూడాలని సీఎం సిద్దరామయ్యకి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి నమ్మ బైక్‌ ట్యాక్సీ అసోసియేషన్‌ విజ్ఞప్తి చేసింది.

భద్రతపై సందేహాలు

ఇదే నేపథ్యంలో బెంగళూరు జయానగర్‌ బాటా షోరూమ్‌ దగ్గర ఓ ర్యాపిడో డ్రైవర్, మహిళా ప్రయాణికురాలి మధ్య ఘర్షణ జరిగింది. బైక్‌ రైడర్‌ని రెండుసార్లు కొట్టింది ఆ మహిళ. దీంతో ఆ మహిళను చెంపపై కొట్టాడు ర్యాపిడో డ్రైవర్‌. ఈ సంఘటన తర్వాత బైక్‌ ట్యాక్సీ ప్రయాణికుల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.మరి,హైదరాబాద్‌లో లక్షా పదివేలకు పైగా బైక్ ట్యాక్సీలు నడుస్తున్నాయి. లక్షమందికి పైగా దీని ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఇక డైలీ లక్షలాదిమంది పేద, మధ్యతరగతి ప్రజలు బైక్‌ ట్యాక్సీ (Bike taxi) లనే నమ్ముకుని ప్రయాణాలు సాగిస్తున్నారు. ఇప్పుడు కర్నాటక ప్రభావంతో మిగిలిన మెట్రో సిటీల్లో కూడా బైక్‌ ట్యాక్సీ రైడర్లకు, వాటి మీద ఆధారపడ్డ జనానికి దడ మొదలైంది. ఇది చివరకు ఎటు దారితీస్తుందో చూడాలి.

Read Also: TTD: ఢిల్లీ టిటిడి కళాశాలలో వృత్తి కోర్సులు

#BangaloreBikeTaxi #BangaloreNews #BikeTaxiBan #HighCourtOrder Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.