📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Karnataka: కర్ణాటక లో మత ఘర్షణలను ఆపేందుకు స్పెషల్ ఫోర్స్

Author Icon By Anusha
Updated: May 29, 2025 • 3:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్ణాటకలోని కోస్తా ప్రాంతాంలో మతపరమైన హత్యలు, ఘర్షణలు ఎక్కువ అయ్యాయి. వీటిని ఎదుర్కునేందుకు రాష్ట్ర సర్కారు సరికొత్త నిర్ణయం తీసుకుంది. దక్షిణ కన్నడ, ఉడిపి, శివమొగ్గ ప్రాంతాలను సున్నితమైన జిల్లాలుగా గుర్తించి ప్రత్యేక యాక్షన్ ఫోర్స్ దళాన్ని(Special Action Force) ఏర్పాటు చేసింది. ఈ దళంలో మొత్తంగా 248 మంది పోలీసు సిబ్బంది ఉంటారు. అలాగే మూడు కంపెనీలు ఉండగా ప్రతి మూడు జిల్లాల్లో ఒక కంపెనీ మోహరిస్తుంది. మూడు కంపెనీలతో ఆ దళం ఉంటుందని అధికారిక వర్గాలు తెలిపాయి.ఈ ప్రత్యేక యాక్షన్ ఫోర్స్ మత ఘర్షణల వివాదాలపై దృష్టి పెట్టనుంది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను మే 28వ తేదీన జారీ చేసింది కర్ణాటక సర్కారు. మత ఘర్షణల ప్రత్యేక దళంలో మొత్తం 248 మంది అధికారులు ఉంటారు. అందులో ఒక సీనియర్ డీఐజీపీ(DIGP) ర్యాంకు అధికారి కూడా ఉంటారు.

ఏర్పరచడానికి

యాంటీ నక్సల్స్ ఫోర్స్(Anti-Naxal Force) నుంచి 248 మందిని తీసుకోనున్నారు. ప్రస్తుతం యాంటీ-నక్సల్స్ ఫోర్స్ (ఏఎన్ఎఫ్)లో 656 మంది అధికారులు, సిబ్బంది ఉండగా, రాబోయే మూడు సంవత్సరాల్లో ఆ సంఖ్య 376కు తగ్గించనున్నారు. మతపరమైన ఘర్షణలు, ప్రేరేపిత ఘటనలు, విద్వేష ప్రసంగాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్(Intelligence) సమాచారాన్ని సేకరించడం ఈ ప్రత్యేక దళం తొలి ప్రాధాన్యతగా ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. రాష్ట్రంలో శాంతి సామరస్యతను ఏర్పరచడానికి అన్ని వర్గాల నేతలతో చర్చలు నిర్వహించాలని ఆదేశించినట్లు హోంశాఖ మంత్రి జీ పరమేశ్వర(G.Parameshwara) తెలిపారు.మే 1న మంగళూరులోని బాజ్‌పే సమీపంలో రౌడీ షీటర్, ఒక హత్య కేసు నిందితుడు సుహాస్ శెట్టి హత్య తర్వాత, ద్వేషపూరిత ప్రసంగాలు సహా మతపరమైన నేరాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఒక ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేస్తామని కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర ప్రకటించారు. కర్ణాటక రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలు పూర్తిగా తగ్గిపోవడంతో యాంటీ నక్సల్స్ ఫోర్స్‌లోని అధికారులు, సిబ్బందితో ఈ స్పెషన్ యాక్షన్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయనుంది హోంశాఖ.

Karnataka: కర్ణాటక లో మత ఘర్షణలను ఆపేందుకు స్పెషల్ ఫోర్స్

అవకాశాలు

దక్షిణ కన్నడ జిల్లా నుంచి మతపరమైన సంఘటనలు ఎక్కువగా రికార్డు అవుతున్నాయని మంత్రి పరమేశ్వర అన్నారు. ఈ జిల్లాలో విద్యావంతులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, వృద్ధి పరంగా కూడా ఎక్కువ అవకాశాలు ఉన్న జిల్లా అని మంత్రి తెలిపారు. దక్షిణ కన్నడ(South Kannada) జిల్లాలో మతపరమైన ఘటనలను పూర్తిగా కట్టడి చేసి, శాంతిని నెలకొల్పడానికి తాము కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు.

Read Also: Gujarat: ప్రియుడితో పారిపోయేందుకు ఓ భార్య మాస్టర్ ప్లాన్

#CoastalKarnataka #CommunalViolence #KarnatakaNews #SpecialTaskForce Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.