हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Karnataka: కాంగ్రెస్ బీజేపీ ఏకం అందుకే కమల్ పై ఫైర్

Anusha
Karnataka: కాంగ్రెస్ బీజేపీ ఏకం అందుకే కమల్ పై ఫైర్

తమిళ హీరో కమల్ హాసన్ తన తాజా చిత్రం “తగ్ లైఫ్” విడుదలకు ముందు కొత్త వివాదంలో చిక్కుకున్నారు.  చెన్నైలో నిర్వహించిన ఒక సినిమా వేడుకలో తమిళం నుంచి కన్నడ భాష పుట్టింది అంటూ చేసిన వ్యాఖ్యలతో కన్నడ సంఘాలు, కర్ణాటకలోని రాజకీయ పార్టీలు, ఇతర వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అసలే మన దేశంలో కన్నడ, తమిళం అంటే ఆ రాష్ట్రాల ప్రజల్లోనే కాకుండా రాజకీయాల్లో ఎంతో భాషాభిమానం ఉంటుంది. అలాంటిది ఒక సినీ నటుడు, పైగా రాజకీయ నేతగా ఉన్న కమల్ హాసన్(Kamal Hassan) కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలతో ఆ రాష్ట్రంలో ఇప్పుడు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అయితే గతంలో కూడా కమల్ హాసన్ కన్నడ భాషను అవమానించారని పలువురు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా కన్నడ భాషపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కర్ణాటకలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ పార్టీలు ఏకాభిప్రాయంతో కమల్ హాసన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. కమల్ చేసిన వ్యాఖ్యలు కన్నడ అస్తిత్వాన్ని అవమానించేవిగా ఉన్నాయని అభివర్ణించాయి. ఈ వ్యవహారంపై స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah) కన్నడకు సుదీర్ఘ చరిత్ర ఉందని. పాపం కమల్ హాసన్‌కు దాని గురించి తెలియదని ఎద్దేవా చేశారు.

అనుకూల

ఇక బీజేపీ ఎమ్మెల్యే, కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్. అశోక(R. Ashoka) కమల్ హాసన్ ఒక మానసిక రోగి అని పేర్కొన్నారు. కన్నడ భాష సాంస్కృతిక గుర్తింపును అవమానిస్తున్నారని మండిపడ్డారు. కమల్ హాసన్ కన్నడ భాషను, కర్ణాటకవాసులను పదేపదే అగౌరవపరుస్తున్నారని ఆరోపించారు. కమల్ హాసన్ సినిమాలు అన్నింటినీ కర్ణాటకలో బహిష్కరించాలని సిద్ధరామయ్య సర్కార్‌ను కోరుతున్నానని లేకపోతే అతడు మెంటల్ పేషంట్‌లా ప్రవర్తిస్తూనే ఉంటాడని ఆర్ అశోక తీవ్ర వ్యాఖ్యలు చేశారు.మరోవైపు కమల్ హాసన్ వ్యాఖ్యలపై కన్నడ అనుకూల సంఘాలు, సాంస్కృతిక కార్యకర్తలు సహా వివిధ వర్గాలలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చేసిన వ్యాఖ్యలకు వెంటనే కమల్ హాసన్ వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.

 
 Karnataka: కాంగ్రెస్ బీజేపీ ఏకం అందుకే కమల్ పై ఫైర్
Karnataka: కాంగ్రెస్ బీజేపీ ఏకం అందుకే కమల్ పై ఫైర్

భారతీయ

ఇప్పటికే ఈ వ్యవహారంపై స్పందించిన కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర(B.Y. Vijayendra) మరొక భాషను అగౌరవంగా చూపడం అనాగరిక ప్రవర్తన అని ఎక్స్‌(X)లో ట్వీట్ చేశారు. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్నవారు ప్రతి భాషను గౌరవించే సంస్కృతిని కలిగి ఉండాలని కన్నడతో సహా అనేక భారతీయ భాషల్లో నటించిన కమల్ హానస్ తమిళ భాషను కీర్తించడంలో భాగంగా కన్నడను అవమానించడం అహంకారం, గర్వానికి పరాకాష్ట అని విజయేంద్ర పేర్కొన్నారు.

Read Also : JR NTR: ఎన్టీఆర్ కు నివాళుర్పించిన జూనియర్‌ ఎన్టీఆర్‌,ఇతర కుటుంబ సభ్యులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870