Kangana: కంగనా వివాదం: “నా దగ్గర డబ్బుల్లేవు, పదవిలేదు” వ్యాఖ్యలపై రాజకీయ దుమారం

Read Time:  1 min
కంగనా వివాదం: "నా దగ్గర డబ్బుల్లేవు, పదవిలేదు" వ్యాఖ్యలపై రాజకీయ దుమారం
కంగనా వివాదం: "నా దగ్గర డబ్బుల్లేవు, పదవిలేదు" వ్యాఖ్యలపై రాజకీయ దుమారం
FONT SIZE
GET APP

హిమాచల్ ప్రదేశ్‌(Himachal Pradesh)లో వరద బాధితులను ఉద్దేశించి మండి ఎంపీ, నటి కంగనా రనౌత్(Kangana Ranaut) చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. సాయం చేయడానికి తన వద్ద విపత్తు నిధులు గానీ, కేంద్రమంత్రి పదవి గానీ లేవంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ (Congress Party) తీవ్రంగా మండిపడింది. అయితే, తాను వాస్తవ పరిస్థితులనే వివరించానని, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తన వ్యాఖ్యలను వక్రీకరిస్తోందని కంగన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతోంది. ఒక్క మండి జిల్లాలోనే మృతుల సంఖ్య 75కు చేరింది. ఈ నేపథ్యంలో ఆదివారం తన నియోజకవర్గంలోని తునాగ్ వంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో కంగన పర్యటించారు.

విపత్తు నిధులు లేవు: కంగనా రనౌత్

ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడుతూ “కుటుంబాలను ఆదుకోవడానికి నా దగ్గర తక్షణమే ఇచ్చేందుకు విపత్తు నిధులు లేవు. నేను క్యాబినెట్ మంత్రిని కూడా కాదు” అని వ్యాఖ్యానించారు. అయితే, కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని హామీ ఇచ్చారు. కంగన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా స్పందించాయి. సర్వం కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ప్రజలను ఓదార్చాల్సింది పోయి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వారిని మరింత బాధపెట్టడమేనని విమర్శించాయి.

Kangana: కంగనా వివాదం: "నా దగ్గర డబ్బుల్లేవు, పదవిలేదు" వ్యాఖ్యలపై రాజకీయ దుమారం
Kangana: కంగనా వివాదం: “నా దగ్గర డబ్బుల్లేవు, పదవిలేదు” వ్యాఖ్యలపై రాజకీయ దుమారం

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం నా బాధ్యత

ఈ విమర్శలపై కంగన ఘాటుగా స్పందించారు. “ఒక ఎంపీగా నేను ఏం చేయగలనో, నాకున్న పరిమితులేంటో ప్రజలకు స్పష్టంగా చెప్పాను. నిధులు లేనప్పుడు ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం నా బాధ్యత. కానీ, బాధితులను ఆదుకోవడం మానేసి, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నా మాటలపై తప్పుడు ప్రచారం చేస్తోంది” అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు ఎలాంటి సహాయం చేయడం లేదని కూడా ఆమె ఆరోపించారు.

హిమాచల్ వరదలపై కంగనా పర్యటన
ఇటీవల భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో అనేక జిల్లాలు మునిగిపోయాయి.
మండి జిల్లాలో మాత్రమే 75 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ పరిస్థితుల్లో తునాగ్ నియోజకవర్గంలో కంగనా రనౌత్ పర్యటించారు, ప్రజలతో మాట్లాడారు .

Read hindi news: hindi.vaartha.com

Read Also: IND vs ENG: టెస్టు సిరీస్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.