📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

Jio Recharge Plans: జియో లాంచ్ చేసిన రెండు నయా రీచార్జ్‌ ప్లాన్స్‌

Author Icon By Vanipushpa
Updated: April 3, 2025 • 4:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల టెలికం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అన్ని టెలికం కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. టెలికం కంపెనీలు కాలింగ్, ఎస్ఎంఎస్‌లతో మాత్రమే చౌక రీఛార్జ్ ప్లాన్‌లను అందించాలని ఆదేశించింది. ట్రాయ్ విధించిన నిబంధనల మేరకు ప్రముఖ టెలికం కంపెనీ జియో కాలింగ్, ఎస్ఎంఎస్‌లతో మాత్రమే రెండు చౌక రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఇటీవల జియో తన వెబ్‌సైట్‌లో రెండు కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్‌లను జాబితా చేసింది. వినియోగదారులు 365 రోజుల వరకు వ్యాలిడిటీను అందించేలా రూ.1958 ప్లాన్‌, అలాగే 84 రోజుల వ్యాలిడిటీలతో రూ.458 ప్లాన్‌ను లాంచ్ చేసింది. జియో లాంచ్ చేసిన ఈ ప్లాన్స్ గురించి మరిన్ని వివరాలు మీకోసం..

రూ.458 ప్లాన్
జియో కొత్త రూ.458 ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్‌లో యూజర్లకు అపరిమిత కాలింగ్‌తో పాటు 1000 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. దీంతో పాటు జియో సినిమా, జియో టీవీ వంటి యాప్‌లకు కూడా ఉచిత యాక్సెస్ లభిస్తుంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా కాలింగ్, ఎస్ఎంఎస్ మాత్రమే ఉపయోగించే వినియోగదారుల కోసం తీసుకువచ్చారు. ఈ ప్లాన్ ద్వారా భారతదేశం అంతటా ఏ నెట్‌వర్క్‌లోనైనా అపరిమిత కాల్స్, ఉచిత జాతీయ రోమింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
రూ.1958 ప్లాన్
జియో రూ. 1958 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా 365 రోజుల వ్యాలిడిటీతో లాంచ్ చేశారు. ఈ ప్లాన్‌ ద్వారా వినియోగదారులు భారతదేశం అంతటా ఏ నెట్‌వర్క్‌లోనైనా అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. దీంతో పాటు 3600 ఉచిత ఎస్ఎంఎస్‌లతో పాటు ఉచిత జాతీయ రోమింగ్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్ జియో సినిమా, జియో టీవీ వంటి యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Jio launches two new recharge plans Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.