Jharkhand: ఝార్ఖండ్‌లో తమ అభిమాన హెడ్ మాస్టర్ బదిలీని వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన నిరసన ఉద్యమం ఎట్టకేలకు విజయవంతమైంది. విద్యార్థుల గట్టి పట్టుదల ముందు అధికారులు వెనక్కి తగ్గక తప్పలేదు. మూడు రోజుల పాటు తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగిన ఈ ఆందోళనల ఫలితంగా ప్రభుత్వం ఎట్టకేలకు బదిలీ ఉత్తర్వులను పూర్తిగా ఉపసంహరించుకుంది.
బదిలీకి వ్యతిరేకంగా రోడ్డెక్కిన విద్యార్థులు
గఢ్వా జిల్లా కండి బ్లాక్‌లోని ప్రభుత్వ ప్లస్ టూ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మలయ్ కుమార్ సింగ్‌ను అధికారులు ఇటీవల బదిలీ చేశారు. ఆయన హయాంలో పాఠశాల సర్వతోముఖాభివృద్ధి చెందిందని భావించిన విద్యార్థులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. “మా సార్ మాకే కావాలి” అంటూ ప్లకార్డులతో ప్రధాన రహదారిపై బైఠాయించి గంటల తరబడి ట్రాఫిక్‌ను స్తంభింపజేశారు.
Read also: LPG eKYC: గ్యాస్ కస్టమర్లకు కీలక అప్‌డేట్.. ఈకేవైసీకి 16 వరకు గడువు
Jharkhand: ఉద్రిక్తతకు దారితీసిన ఘటనలు
ఆందోళన చేస్తున్న విద్యార్థులను శాంతింపజేసేందుకు వచ్చిన కండి బ్లాక్ చీఫ్ సత్యేంద్ర పాండే ఒక విద్యార్థిపై చేయి చేసుకున్నారనే ఆరోపణలతో పరిస్థితి ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది. ఆగ్రహంతో ఊగిపోయిన విద్యార్థులు ఆయన వాహనంపై దాడి చేశారు. దీంతో ఆయన పోలీస్ స్టేషన్‌లో తలదాచుకోగా, ఆందోళనకారులు స్టేషన్‌పై రాళ్లు రువ్వడంతో ఒక పోలీసు అధికారి తలకు గాయాలయ్యాయి.
దిగివచ్చిన అధికారులు.. ఆందోళన విరమణ
పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు రంగంలోకి దిగి విద్యార్థులతో చర్చలు జరిపారు. విద్యార్థుల డిమాండ్‌ను అంగీకరిస్తూ ప్రధానోపాధ్యాయుడు మలయ్ సింగ్ బదిలీని రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అనంతరం విద్యార్థులతో ఫోన్‌లో ఆయనను మాట్లాడించడంతో వారు శాంతించి తమ ఆందోళనను విరమించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :