📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Rahul Gandhi: రాహుల్ కి జార్ఖండ్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్

Author Icon By Vanipushpa
Updated: May 24, 2025 • 1:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

లోక్ సభ ప్రతిపక్ష నేత, వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి జార్ఖండ్‌(Jharkhand)లోని చైబాసా ఎంపీ(Chaibasa)-ఎమ్మెల్యే కోర్టు నాన్-బెయిలబుల్(Non-bailabul) వారెంట్ జారీ చేసింది. 2018 నాటి పరువు నష్టం దావా కేసులో ఈ వారెంట్ ఇచ్చింది. జూన్ 26న వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరుకావాలని రాహుల్ గాంధీకి ఆదేశాల జారీ చేసింది. ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

Rahul Gandhi: రాహుల్ గాంధీకి జార్ఖండ్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్

అమిత్ షాపై వివాదస్పద వ్యాఖ్యలు
2018లో కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. “హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా బీజేపీకి అధ్యక్షుడు కాగలడు” అని రాహుల్ వాఖ్యానించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు బీజేపీ కార్యకర్తలందరినీ అవమానించేలా ఉన్నాయని, పరువు నష్టం కలిగించాయని ఆరోపిస్తూ బీజేపీ నేత ప్రతాప్ కతియార్ 2018 జూలై 9న చైబాసా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎం) కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రాహుల్ గాంధీకి సమన్లు జారీ
తదనంతర కాలంలో, జార్ఖండ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ పరువు నష్టం కేసును 2020 ఫిబ్రవరిలో రాంచీలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ చేశారు. ఆ తర్వాత మళ్లీ ఈ కేసు చైబాసాలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ అయింది. ఈ కేసును విచారణకు స్వీకరించిన మేజిస్ట్రేట్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేశారు.
కోర్టు పలుమార్లు సమన్లు జారీ చేసినప్పటికీ రాహుల్ గాంధీ విచారణకు హాజరుకాలేదు. దీంతో తొలుత ఆయనపై బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ వారెంట్‌పై స్టే విధించాలని కోరుతూ రాహుల్ గాంధీ జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను 2024 మార్చి 20న హైకోర్టు కొట్టివేసింది. అనంతరం, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ రాహుల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా చైబాసా కోర్టు తిరస్కరించింది. తాజాగా, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించిన ప్రత్యేక న్యాయస్థానం నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ, జూన్ 26న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

Read Also: Monsoon reaches Kerala: కేరళకు చేరిన నైరుతి రుతుపవనాలు

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu issues non-bailable Jharkhand court Latest News in Telugu Paper Telugu News rahul gandhi Telugu News online Telugu News Paper Telugu News Today warrant to

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.