📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Jamnagar: జామ్‌నగర్‌లో అక్రమ మత కట్టడం.. బయటపడ్డ విస్తుపోయే విషయాలు

Author Icon By Anusha
Updated: June 16, 2025 • 12:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జామ్‌నగర్ నగరంలో వెలుగులోకి వచ్చిన ఓ అక్రమ మతపరమైన నిర్మాణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.విలాసవంతమైన సౌకర్యాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.నగరంలోని బచ్చునగర్ (Bachunagar) అనే ప్రాంతంలో 11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కట్టడంలో స్విమ్మింగ్ పూల్, అధునాతన బాత్‌టబ్, విశాలమైన గదులు వంటి అనేక విలాసవంతమైన వసతులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.దీనిని అధికారులు ఇతర అక్రమ కట్టడాలతో పాటు కూల్చివేశారని పోలీసులు తెలిపారు.

పునరుద్ధరించేందుకే

ఈ మతపరమైన స్థలాన్ని అక్రమ కార్యకలాపాల కోసం ఉపయోగిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అక్రమ కట్టడాలు నాగమతి నది ప్రవాహానికి అడ్డంకిగా మారాయని పోలీసులు తెలిపారు. నదీ ప్రవాహాన్ని పునరుద్ధరించేందుకే కూల్చివేతలు చేపట్టినట్టు పేర్కొన్నారు. అక్రమంగా నిర్మించిన మత కట్టడంతోపాటు ఇతర అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని, అక్కడ ఒక ఫామ్‌హౌస్, స్విమ్మింగ్ పూల్, బాత్‌టబ్, విశాలమైన గదులను గుర్తించామని వివరించారు.కూల్చివేతల సమయంలో ఆకర్షణీయమైన, రంగురంగుల మార్బుల్ టైల్స్‌తో అలంకరించిన అనేక విశాలమైన గదులను పోలీసులు కనుగొన్నారు.

Jamnagar

విలాసవంతమైన నిర్మాణానికి

ఒక ప్రత్యేక గదిలో అత్యాధునికమైన బాత్‌టబ్ కూడా ఉంది. ఆ బాత్‌టబ్ ఉన్న గది తలుపుపై ‘బయటి వ్యక్తులకు ప్రవేశం లేదు’ అని రాసి ఉన్న ఓ నోటీసును అంటించి ఉండటం గమనార్హం. ఈ మతపరమైన స్థలంలో ఎలాంటి కానుకలు గానీ, డబ్బు గానీ స్వీకరించబోమని తెలిపే ఓ ప్రకటన కూడా ఉంది. ఇంతటి విలాసవంతమైన నిర్మాణానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఈ అక్రమ మతపరమైన స్థలం యజమానులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకోవడానికి పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారని ఎస్పీ ప్రేమసుఖ్ డేలు తెలిపారు.

Read Also: Pune: నదిలో కుప్పకూలిన వంతెన..మరో ఆరుగురి పరిస్థితి విషమం

#GujaratNews #IllegalConstruction #JamnagarNews #UnauthorizedStructure Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.