📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Drones: భారత్ ​కు చాలా డ్రోన్లు అవసరం:అనిల్ భట్

Author Icon By Anusha
Updated: May 16, 2025 • 3:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్- పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో,భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్​తో​ ఆధునిక యుద్ధంలో డ్రోన్​ల ప్రాముఖ్యం తెలిసివచ్చిందని మాజీ డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్​ అనిల్ భట్(Anil Bhatt)​ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తు యుద్ధంలో అంతరిక్షం, సైబర్​స్పేస్​ కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. గురువారం ప్రముఖ వార్తా సంస్థ పీటీఐతో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ప్రతీ దేశం తమ ఆస్తులను అంతరిక్షంలో సురక్షితంగా దాచుకుంటుందని అంచనా వేశారు. యుద్ధంపై సోషల్​ మీడియాలో వచ్చిన వార్తలపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. యుద్ధం అనేది చాలా తీవ్రమైన అంశమని, అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాతే యుద్ధం చివరి ఎంపికగా ఉండాలని సూచించారు. ఈయన డోక్లామ్​ ఉద్రిక్తతల సమయంలో డైరెక్టర్ జనరల్​ ఆఫ్​ మిలిటరీ ఆపరేషన్స్​గా పని చేశారు. ఇండియన్ స్పేస్​ అసోసియేషన్ డైరెక్టర్​గాను బాధ్యతలు నిర్వర్తించారు.డైరెక్టర్ జనరల్​ ఆఫ్​ మిలిటరీ ఆపరేషన్స్ సైనిక కార్యక్రమాల విషయంలో కీలక పాత్ర(key role) పోషిస్తారు. అది యుద్ధంలోనైనా, శాంతి చర్చల్లోనైనా ప్రణాళిక అమలు, పర్యవేక్షణ చేస్తుంటారు. కేవలం ఆర్మీతోనే కాకుండా మూడు విభాగాల మద్య సమన్వయం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుత సమయంలో యుద్ధం ఒకే విధానంలో జరగడం లేదు. కాబట్టి ఆర్మీ, నేవీ, ఎయిర్​ ఫోర్స్​తో కలిపి సమన్వయం చేసుకోవడం చాలా అవసరం.

https://twitter.com/PTI_News/status/1923220247705944352?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1923220247705944352%7Ctwgr%5Efce792d038c20f5a70be3337d2bde70b25de3ee4%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.etvbharat.com%2Fte%2Fbharat%2Fdrones-space-cyberspace-add-new-paradigm-to-military-conflicts-ex-dgmo-anil-bhatt-telugu-news-ten25051601425

అవసరం

ఆపరేషన్ సిందూర్​లో పాకిస్థాన్​కు తుర్కియే మద్దతు ఇవ్వడంపైనా ఆయన మాట్లాడారు. తుర్కియే యుద్ధ సామాగ్రిని తయారు చేస్తుందని, చాలా దేశాలకు విక్రయిస్తుంటుందని చెప్పారు. ఇందులో భౌగోళిక రాజకీయ కారణాల కన్నా వ్యాపార ప్రయోజనాలే ఎక్కువగా ఉంటాయని వివరించారు. “భారత్​కు యుద్ధంలో ఎక్కువ కాలం పాటు ఉంటే చాలా డ్రోన్లు(Drones) అవసరం పడుతాయి. ఇందులో చాలా వరకు ఒకసారి ఉపయోగించేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎక్కువ సంఖ్యలో డ్రోన్లు అవసరం. ఈ మేరకు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎక్కువ సంఖ్యలో డ్రోన్లు ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో భారత్ సామార్థ్యాన్ని పెంచుకోవాలి.” అని అనిల్ భట్​ తెలిపారు.

Read Also: Operation sindoor: భారత్‌కు ఆపరేషన్‌ సిందూర్‌తో వేల కోట్ల లాభం! ఎలాగంటే..?

#AnilBhatt #IndiaDefense #OperationSindhoor #TurkeyPakistan Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Operation Sindoor Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.