हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu News: EC ఎన్నికల కమిషనర్‌ పై ‘ఇండియా’ కూటమి అభిశంసన తీర్మాన యోచన

Vanipushpa
Latest Telugu News: EC ఎన్నికల కమిషనర్‌ పై ‘ఇండియా’ కూటమి అభిశంసన తీర్మాన యోచన

ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ (Gyanesh Kumar)ను పదవి నుంచి తొలగించడానికి ఆయనపై అభిశంసన తీర్మానం తీసుకువచ్చే అంశాన్ని ‘ఇండియా’ (India)కూటమి పరిశీలిస్తోంది. సోమవారం జరిగిన ప్రతిపక్ష పార్టీల ఎంపీల సమావేశంలో దీనిపై చర్చించారు. ఎన్నికల కమిషనర్‌పై అభిశంసన తీర్మానం తీసుకురావడానికి ప్రతిపక్షాలు సన్నాహాలు ప్రారంభించాయని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్(Sanjay raut) అన్నారు. ఎన్నికల కమిషన్‌ ‘ఓట్ల చోరీ’ చేస్తోందని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆగస్టు 7న ఆరోపించారు.
మీడియా సమావేశంలో సీఈసీ సమాధానం ఇవ్వలేదు
అయితే, రాహుల్ గాంధీ ఆరోపణలు నిరాధారమైనవని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈనెల 17న జరిగిన విలేఖరుల సమావేశంలో స్పష్టంచేశారు. సీఈసీ మీడియా సమావేశం తర్వాత, సోమవారం ప్రతిపక్ష పార్టీల ఎంపీల సమావేశం జరిగింది. ది హిందూ ఆంగ్ల వార్తాపత్రికతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ మాట్లాడుతూ “ఆయన (జ్ఞానేష్ కుమార్) ప్రధాన ఎన్నికల కమిషనర్ మాదిరి కాకుండా బీజేపీ నాయకుడిలా మాట్లాడారు” అని అన్నారు. “ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఇతర పార్టీలు లేవనెత్తిన ప్రశ్నలకు మీడియా సమావేశంలో సీఈసీ సమాధానం ఇవ్వలేదు. బదులుగా, ప్రశ్నలు లేవనెత్తినందుకు ప్రతిపక్షాలను ఆయన ఎగతాళి చేశారు. రాజకీయాల్లో పాల్గొనడం సీఈసీ పనా?” అని వేణుగోపాల్ ప్రశ్నించారు.

EC ఎన్నికల కమిషనర్‌ పై 'ఇండియా' కూటమి అభిశంసన తీర్మాన యోచన
EC ఎన్నికల కమిషనర్‌ పై ‘ఇండియా’ కూటమి అభిశంసన తీర్మాన యోచన

ఎన్నికల కమిషనర్‌ను నియమించే విధానం ఏంటి?
దేశంలో స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడం ఎలక్షన్ కమిషన్ బాధ్యత. దీని అధికారులను అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్లను భారత రాష్ట్రపతి నియమిస్తారు. దీని కోసం, ముగ్గురు సభ్యుల ఎంపిక కమిటీ సిఫార్సులు చేస్తుంది. ఈ కమిటీలో ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు లేదా లోక్‌సభలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నాయకుడు, కేంద్ర మంత్రి మండలి సభ్యుడు ఉంటారు. కేబినెట్ కార్యదర్శి నేతృత్వంలోని సెర్చ్ కమిటీ ఎంపిక కమిటీకి అభ్యర్థుల పేర్లను ప్రతిపాదిస్తుంది. ఎన్నికల కమిషనర్ నియామకం, వారి పదవీకాలం, తొలగింపు ప్రక్రియ రాజ్యాంగంలోని ఆర్టికల్ 324, ‘చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్(అపాయింట్మెంట్స్, కండీషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టెన్యుర్) యాక్ట్, 2023′ నిబంధనల ప్రకారం జరుగుతాయి.
గతంలో నియామకం ఎలా జరిగింది?
2023 చట్టం రాకముందు, ఎన్నికల కమిషనర్ల నియామకం 1991 ఎలక్షన్ కమిషన్ (సర్వీస్ కండీషన్స్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్స్)యాక్ట్ ప్రకారం జరిగేది. కానీ ఈ చట్టంలో ఎంపిక ప్రక్రియను నిర్వచించలేదు. ఫలితంగా, ప్రధానమంత్రి, మంత్రి మండలి సలహా మేరకు రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్లను నియమించేవారు. ఎన్నికల కమిషనర్ల సంఖ్యను ఎప్పటికప్పుడు నిర్ణయించే అధికారం రాష్ట్రపతికి ఉండేది. పాత చట్టం ప్రకారం, ఎన్నికల కమిషనర్ల జీతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమానంగా ఉండేది.

EC ఎన్నికల కమిషనర్‌ పై 'ఇండియా' కూటమి అభిశంసన తీర్మాన యోచన
EC ఎన్నికల కమిషనర్‌ పై ‘ఇండియా’ కూటమి అభిశంసన తీర్మాన యోచన

సీఈసీని తొలగించే విధానం ఏమిటి?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) ప్రకారం, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను “సుప్రీంకోర్టు న్యాయమూర్తి మాదిరిగానే, అదే కారణాలతో” పదవి నుంచి తొలగించవచ్చు. 2023 చట్టంలోని సెక్షన్ 11(2) కింద ఇలాంటి నిబంధన ఉంది. ఆర్టికల్ ప్రకారం, “ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఫార్సుపై తప్ప మరే ఇతర ఎన్నికల కమిషనర్ లేదా ప్రాంతీయ కమిషనర్‌ను పదవి నుంచి తొలగించకూడదు”. రాజకీయ ఒత్తిడి నుంచి ఎన్నికల కమిషన్‌ను రక్షించడానికి, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించే ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా చాలా కష్టతరం చేశారు. 2023లో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సమీక్షించింది, ఎన్నికల కమిషనర్లను తొలగించే ప్రక్రియను మార్చడానికి రాజ్యాంగ సవరణ అవసరమని పేర్కొంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధానాన్ని నిర్దేశించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 (4) ప్రకారం, “దుష్ప్రవర్తన లేదా అసమర్థత నిరూపితమైతే” మాత్రమే సీఈసీని తొలగించడానికి చర్య తీసుకోవచ్చు. దుష్ప్రవర్తనలో అవినీతి పద్ధతులు లేదా పదవీ దుర్వినియోగం ఉండవచ్చు. ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవికి తగని చర్యలు లేదా అధికారిక విధులను నిర్వర్తించడంలో స్పష్టమైన వైఫల్యాలు కూడా ఇందులో ఉన్నాయని కాలానుగుణంగా కోర్టులు పేర్కొన్నాయి.
వివాదమేంటి?
ఆగస్టు 7న జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భారత ఎన్నికల సంఘంపై ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి ‘ఓట్ల చోరీ’కి పనిచేస్తున్నాయని, ‘బిహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఓట్లను దొంగిలించే ప్రయత్నం’ అని రాహుల్ గాంధీ ఆరోపించారు. హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చిన తర్వాత ఈ సందేహాలు మరింత బలపడ్డాయని ఆయన చెప్పారు. ఇది ‘ప్రజాస్వామ్య వ్యతిరేక కుట్ర’గా విమర్శిస్తూ, ఆధారాలంటూ కొన్ని వివరాలు కూడా చూపించారు రాహుల్. దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణలిచ్చారాయన. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తాను చెబుతున్నది నిజమని నమ్మితే అఫిడవిట్‌పై సంతకం చేసి, ఫిర్యాదు చేయాలని ఎలక్షన్ కమిషన్ సూచించింది. అంతేకాదు, రాహుల్ ఆరోపణలపై ఎలక్షన్ కమిషన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/white-house-extra-tariffs-on-india-to-pressure-russia/international/533161/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870