📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025: ఒత్తిడి ఎక్కువ కావడంతో కెప్టెన్సీకి దూరంగా ఉన్నా: కోహ్లీ

Author Icon By Anusha
Updated: May 6, 2025 • 2:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విరాట్ కోహ్లీ పేరు వింటేనే ముందుగా బ్యాటింగ్ గుర్తుకొస్తుంది. విరాట్ కోహ్లీ టన్నుల కొద్దీ రన్స్, రికార్టుల మీద రికార్డులతో చరిత్ర సృష్టించాడు. విరాట్ కోహ్లీకి ఆటకు, కెప్టెన్సీకి చాలా కోట్ల కొద్ది అభిమానులు ఉన్నారు. విరాట్ కోహ్లీ ఏ మ్యాచ్ అయినా దూకుడుగా రాణిస్తాడు. కింగ్ కోహ్లీ తన ప్లానింగ్, జట్టును నడిపించడంలో ముందుండి నడిపించే తీరు అద్భుతంగా ఉంటుంది. ఇదిలా ఉండగా టీమిండియా జట్టుతో పాటు ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ దూరంగా ఉంటున్నాడు. కింగ్ కోహ్లీ కెప్టెన్సీకి ఎందుకు దూరంగా ఉంటున్నాడో తాజాగా ఓ ఇంటర్వ్యూలో విరాట్ కీలక విషయాలను వెల్లడించాడు. ఆర్సీబీ జట్టు బాధ్యతల నుంచి తాను ఒప్పుకోవడానికి గల కారణాలను కూడా విరాట్ కోహ్లీ పంచుకున్నాడు.

నిర్ణయం

విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఐపీఎల్ 2016 నుంచి ఐపీఎల్ 2019 వరకు 3 సీజన్లు పాటు తనపై తీవ్రంగా ఒత్తిడి ఉండేదని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఆ మూడేళ్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్‌గా, కెప్టెన్‌గా వ్యవహరించానని అయితే తన ప్రతి మ్యాచ్‌లోనూ అద్భుతంగా రాణించాలని తనపై ఒత్తిడి ఉండేదని విరాట్ కోహ్లీ అన్నాడు. ప్రతి మ్యాచ్‌లో బ్యాటర్‌గా విజయవంతం కావడంతో పాటు కెప్టెన్సీలోనూ తనపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాడని విరాట్ కోహ్లీ వెల్లడించాడు. టీమిండియాతో పాటు ఆర్సీబీ విషయంలోనూ అంచనాలు, ఒత్తిడి ఎక్కువ కావడంతో కెప్టెన్సీకి దూరంగా ఉంటున్నట్లు కింగ్ కోహ్లీ స్పష్టం చేశాడు.బ్యాటింగ్‌తో పాటు సారథిగానూ విజయవంతం కావాలనే అంచనాలతో ఒత్తిడికి గురయ్యానని విరాట్ కోహ్లీ తెలిపాడు. ప్రతి రోజు అదే ఆలోచనతో ఉండేవాడినని దీనిని సరిగ్గా నిర్వహించలేకపోయాలని కోహ్లీ చెప్పుకొచ్చాడు. అందుకే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీకి గుడ్ బై చెప్పినట్లు విరాట్ అసలు విషయాన్ని వెల్లడించాడు. బ్యాటర్‌గా రాణించడం కోసం ఒత్తిడి లేకుండా ఉండడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విరాట్ తెలిపాడు. ఆటలో ఎక్కువ రోజులు కొనసాగడానికి ఈ నిర్ణయం తీసుకోక తప్పదన్నాడు.

అభివృద్ధి

ఇషాంత్‌తో నాకు సహజంగానే అనుబంధం ఉందని మొదటి రోజు నుంచి కలిసి ఆడినా, ఆడకపోయినా అతడిలో ఎలాంటి మార్పులేదని విరాట్ కోహ్లీ తెలిపాడు. ప్రతి ఒకటి తనతో పంచుకోగలనని కాబట్టి ఇషాంత్ నా జీవితంలో చాలా ప్రత్యేకమైన వ్యక్తి అంటూ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. తాను టెక్నికల్‍‌గా అంత మంచి ప్లేయర్ కాదని సహజంగానే ప్రతిభావంతుడైన ఆటగాడిని కాదని నేనెప్పుడూ సిగ్గపడలేదని విరాట్ చెప్పుకొచ్చాడు. తాను ఆడుతున్నప్పుడు చాలా విషయాలను నేర్చుకుని అభివృద్ధి చెందానన్నాడు. తాను ప్రతి విషయంలో బెస్ట్ ఉండాలని అనుకున్నానని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు.

Read Also: IPL 2025: ఐపిఎల్ లో రికార్డు సృష్టించిన ట్రిస్టన్ స్టబ్స్

#CaptainKohli #CricketPressure #IPL2016to2019 #kingkohli #RCB #ViratKohli Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.