📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

DK Shivakumar: కమీషన్‌ డిమాండ్‌ చేస్తే లోకాయుక్తకు ఫిర్యాదు చేయండి :శివకుమార్‌

Author Icon By Anusha
Updated: April 11, 2025 • 4:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్నాటక  ఉప ముఖ్యమంత్రి శివకుమార్‌,బిల్లులు చెల్లించేందుకు ఎవరైనా కమీషన్‌ డిమాండ్‌ చేస్తే లోకాయుక్తకు ఫిర్యాదు చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు.గత బీజేపీ ప్రభుత్వ హయాంలో కంటే ఇప్పుడు కమీషన్లు పెద్ద ఇబ్బందిగా మారాయని కర్నాటక కాంట్రాక్టర్ల సంఘం (కేఎస్ సిఏ) ఆరోపించిన నేపథ్యంలో ఆయన స్పందించారు.అసెంబ్లీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం శివకుమార్‌, మరో ఇద్దరు సీనియర్‌ మంత్రుల కార్యాలయాల్లో అవినీతి మితిమీరిపోయిందని కాంట్రాక్టర్ల సంఘం గురువారం సంచలన ఆరోపణలు ఆరోపించింది. మంత్రుల కార్యాలయాల్లో బ్రోకర్లు కిక్కిరిసిపోయి ఉంటారని,మైనర్‌ ఇరిగేషన్‌ మంత్రి ఎన్‌ఎస్‌ బోస్‌రాజు తనయుడు రవి బోస్‌రాజు లావాదేవీలన్నీ తానే జరుపుతారని, ప్రజా పనుల శాఖ మంత్రి సతీశ్‌ జార్కిహోళి బంధువు ఒకరు శాఖాపరమైన వ్యవహారాల్లో తలదూరుస్తారని ఆరోపించిన విషయం తెలిసిందే.

బిల్లులు చెల్లించమని

ఆరోపణలను శివకుమార్‌ ఖండించారు. తనతో పాటు మంత్రులపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. బిల్లులు చెల్లించేందుకు కాంట్రాక్టర్ల నుంచి ఎవరైనా కమీషన్‌ అడిగి ఉంటే లోకాయుక్తకు ఫిర్యాదు చేయాలన్నారు. కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ఎందుకు మంత్రిని అడగాలని ప్రశ్నించారు. వారికి (కాంటాక్టర్లకు) శాఖ బడ్జెట్ తెలియదా? గ్రాంట్ లేనప్పుడు వారు కాంట్రాక్టును ఎలా తీసుకున్నారు? అంటూ ప్రశ్నించారు. బీజేపీ హయాంలో తన శాఖ మాత్రమే రూ.లక్ష కోట్లకుపైగా విలువైన కాంట్రాక్టులను ఇచ్చిందని ఈ కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించమని ఎమ్మెల్యేలు అడుగుతున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు తాను కాంట్రాక్టర్లను హెచ్చరించానని ఆయన అన్నారు. నిధులు లేకుండా ఏ పని చేయవద్దని హెచ్చరించినా మాట వినలేదని ఇప్పుడు రాజకీయ నేతల వద్దకు వస్తున్నారన్నారు.

పెట్రోల్, డీజిల్‌

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గినప్పటికీ- బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై లీటరు ఒక్కింటికి రెండు రూపాయల మేర ఎక్సైజ్ ట్యాక్స్‌ను పెంచిందని, ఇది దేశ ప్రజలకు బహుమతిగా ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. కర్ణాటక బీజేపీ రాష్ట్రశాఖ ఇప్పుడు ఈ పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదలకు నిరసనగా ఢిల్లీలో తమ పార్టీ అధిష్ఠానం వద్ద నిరసనలు ప్రదర్శనలు నిర్వహిస్తుందా? లేక- కర్ణాటక ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికి మాత్రమే పరిమితమౌతుందా? అంటూ సెటైర్లు వేశారు. ఇప్పుడు తాజాగా కర్ణాటక కాంగ్రెస్ కమిటీనేత, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా తెర మీదికి వచ్చారు. బీజేపీ రాష్ట్ర శాఖ నాయకులపై ఎదురుదాడికి దిగారు. డీజిల్‌పై మాత్రమే మూడు శాతం మేర అమ్మకపు పన్ను పెంచితే బీజేపీ నాయకులు ఆందోళనలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారని, ఇప్పుడు కేంద్రం చేసిన పనికి ఆందోళనలు చేస్తారా? అంటూ నిలదీశారు.డీజిల్ ధరల పెంపుదలకు నిరసనగా జన్ ఆక్రోశ్ యాత్ర చేస్తోన్నందుకు బీజేపీ నాయకులందరినీ అభినందిస్తోన్నానని డీకే శివకుమార్ చెప్పారు.

Read Also: Modi: తహవ్వుర్‌ రాణా నిర్దోషిగా కాదు దోషినే: ప్రధాని మోదీ ట్వీట్

#CommissionScam #ContractorsIssue #DKShivakumar #karnatakapolitics #lokayukta Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.