సెంథిల్ బాలాజీకి సుప్రీం కోర్టు అనేక ప్రశ్నలు సంధించింది. ముఖ్యంగా నగదు మోసం కేసులో 2023లో ఆయన అరెస్ట్ కాగా 2024 సెప్టెంబర్ నెలలో బెయిల్‌పై బయటకు వచ్చారు. మరుసటి రోజే మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే బెయిల్ మంజూరు చేసేటప్పుడు మంత్రి పదవి స్వీకరించడానికి తాము అనుమతి ఇవ్వలేదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. మీకు మంత్రి పదవి కావాలా, బెయిల్ కావాలా అనేది మీరే తేల్చుకొని చెప్పాలని వివరించింది. ఒకవేళ మంత్రి పదవే కావాలనుకుంటే మళ్లీ జైలుకి రావాల్సిందేనని స్పష్టం చేసింది.పూర్తి వివరాలు.2023 జూన్ నెలలో తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ నగదు మోసం కేసులో అరెస్ట్ అయ్యారు. ఈడీయే నేరుగా ఆయన్ను అదుపులోకి తీసుకుని జైల్లో పెట్టింది. అయితే బెయిల్ కావాలంటూ ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లగా న్యాయస్థానం విచారణ జరిపింది. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం సెంథిల్ బాలాజీకి బెయిల్ మంజూరు చేసింది. ఇలా ఆయన 2024 సెప్టెంబర్ నెలలో బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే మరుసటి రోజే మంత్రి పదవిలో చేరి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో సెంథిల్ బాలాజీకి మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు అయింది.
న్యాయవాది
ఈ పిటిషన్‌పై బుధవారం రోజు అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. సెంథిల్ బాలాజీ సాక్ష్యాలను తారుమారు చేసేందుకు యత్నిస్తున్నట్లు ఈడీ తరఫు న్యాయవాది వాదించారు. సాక్ష్యాలను తారుమారు చేస్తారనే భయం ఉంటే కేసు మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని సెంథిల్ బాలాజీ తరఫు న్యాయవాది కోరారు. అయితే ఆయనకు బెయిల్ మంజూరు చేసిన సమయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి అనుమతి లేదని జస్టిస్ అభయ ఎస్ ఓక, జస్టిస్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. మంత్రిగా లేకపోవడంతోనే ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లు తెలిపింది.
విచారణ
సెంథిల్ బాలాజీకి బెయిల్ కావాలా లేదా మంత్రి పదవి కావాలా అనేది సోమవారం నాటికి తెలియజేయాలని సూచించింది. ఒకవేళ మంత్రి పదవి మాత్రమే కావాలనుకుంటే కచ్చితంగా మళ్లీ జైలుకే వెళ్లాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. అలాగే విచారణను ఏప్రిల్ 28వ తేదీకి వాయిదా వేసింది. మరి సెంథిల్ బాలాజీ మంత్రి పదవి కోరుకుంటారా లేక బెయిలే కావాలని కోర్టుకు వెళ్తారా అనేది తెలియాలంటే మరో మూడు, నాలుగు రోజులు వేచి చూడాలి.మరోవైపు, సెంథిల్ బాలాజీ గతంలో ఒక ప్రకటనలో ఇలా పేర్కొన్నారు”సుప్రీం కోర్టు విధించిన బెయిల్ షరతులను నేను ఉల్లంఘించలేదు. ప్రజల మద్దతుతో వచ్చిన ఓటింగ్ ఫలితాలపై రాజకీయ పదవిని చేపట్టడం తప్పేమీ కాదు. దానికి నన్ను దోషిగా చూపడం అన్యాయం.”ఈ అంశం తమిళనాడు రాజకీయాల్లో, కేంద్ర-రాష్ట్ర సంబంధాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Read Also: TamilNadu: తమిళనాడులో మయోన్నైస్ నిషేధం