📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Fighter Jets: యుద్ధ విమానాల తయారీ కేంద్రంగా హైదరాబాద్ పరిశ్రమలు

Author Icon By Vanipushpa
Updated: May 29, 2025 • 5:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యుద్ధ విమానాల(War Flights) తయారీ దిశగా తెలంగాణలోని హైదరాబాద్‌(Hyderabad) పరిశ్రమలు ముందడుగు వేశాయి. తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ మార్క్‌-1ఏ(Tejas Mark-1) మధ్య భాగం మొదలు నూతనంగా అభివృద్ధి చేస్తున్న అడ్వాన్స్‌డ్‌ మీడియం కంబాట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ (ఆమ్కా)కి సంబంధించిన బాడీ మొత్తం హైదరాబాద్‌లోనే తయారవుతోంది. ఒకప్పుడు పూర్తిగా ప్రభుత్వ రక్షణ సంస్థలే ఉత్పత్తి చేసిన వీటిని ఆ ప్రమాణాల మేరకు తయారు చేస్తూ తమకూ సామర్థ్యం ఉందని ప్రైవేటు సంస్థలు నిరూపిస్తున్నాయి.

Fighter Jets: యుద్ధ విమానాల తయారీ కేంద్రంగా హైదరాబాద్ పరిశ్రమలు

ఆమ్కా తయారీ అవకాశాలు
ఐదోతరం స్టెల్త్‌ యుద్ధ విమానాన్ని సాకారం చేసే దిశగా ఎగ్జిక్యూషన్‌ నమూనాకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. ఈ లోహ విహంగం డిజైన్‌ బెంగళూరులో జరగ్గా బాడీ ఫ్యాబ్రికేషన్‌ హైదరాబాద్‌లోని వెమ్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో చేపట్టారు. దీన్నే కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జరిగిన ఏరో ఇండియాలో మొదటిసారి ప్రదర్శించారు. కేంద్రం ప్రైవేటు సంస్థలకు పోటీ ప్రాతిపదికన ఆమ్కా తయారీ అవకాశాలు కల్పించబోతోంది. దీని రూపకల్పనలో హైదరాబాద్‌ సంస్థకు అనుభవం ఉండటంతో నగరానికే దక్కే అవకాశం ఉంటుంది. కాక్‌పిట్, రాడార్, ల్యాండింగ్‌ గేర్‌ను ఏడీఏ, ఏవియానిక్స్, హెచ్‌ఏఎల్‌ అభివృద్ధి చేస్తోంది.
భారత్‌లో తయారీ కింద రక్షణ ఉత్పత్తుల విషయంలో ప్రైవేటు సంస్థలకూ అవకాశం ఇవ్వడంతో ఉత్పత్తిలో వేగం పెరిగిందని వెమ్‌ టెక్నాలజీస్‌ సీవోవో ఆర్‌ శ్రవణ్‌ రావు ‘ఈనాడు-ఈటీవీ భారత్​’కు వివరించారు ఆమ్కా పూర్తి బాడీ డిజైన్, కావాల్సిన మెటాలిక్, కంపోజిట్‌ విడిభాగాల వరకు ఉత్పత్తి చేసి వీటిని అసెంబ్లింగ్‌ చేశామని ఆయన తెలిపారు.
పెద్ద మొత్తంలో ఆర్డర్లు
యుద్ధ విమానం తేజస్‌ మార్క్‌-1ఏకి వాయుసేన నుంచి పెద్ద మొత్తంలో ఆర్డర్లు ఉన్నాయి. నౌకాదళం కూడా వీటిని అడుగుతోందని రక్షణ వర్గాలు అంటున్నాయి. తేజస్‌ మార్క్‌-1ఏలో 5 భాగాలు ఉంటే అందులో మధ్య భాగాన్ని హైదరాబాద్‌ నగరంలోని వెమ్‌ టెక్నాలజీస్‌ డెవలప్​ చేసింది. ప్రస్తుతం మరింత అధునాతన తేజస్‌ మార్క్‌-1ఏ కి మధ్య భాగాన్ని సిద్ధం చేశారు. మొదటి ఉత్పత్తిని రేపు (మే 30)న హెచ్‌ఏఎల్‌కు అందజేయబోతున్నారు. ప్రస్తుతం ఒక గిగ్‌పై ఒక మధ్య భాగం తయారీకి 3 నెలల టైం పడుతుందని వెమ్‌ టెక్నాలజీస్‌ జీఎం సీహెచ్‌వీ రామారావు అన్నారు. తమకు యాభై ఆర్డర్లు వచ్చాయని తెలిపారు. “ఒక గిగ్‌పై ఒక మధ్య భాగం తయారీకి 3 నెలల టైం పడుతుంది. మాకు 50 ఆర్డర్లు వచ్చాయి. ప్రస్తుతం మరింత అధునాతన తేజస్‌ మార్క్‌-1ఏ కి మధ్య భాగాన్ని సిద్ధం చేశాం. మొదటి ఉత్పత్తిని రేపు హెచ్‌ఏఎల్‌కు అందజేయబోతున్నాం అన్నారు వెమ్‌ టెక్నాలజీస్‌ జీఎం సీహెచ్‌వి రామారావు.

Read Also: Owaisi: సౌదీలో పాకిస్థాన్ ను తీవ్రంగా విమర్శించిన అసదుద్దీన్ ఒవైసీ

#telugu News Ap News in Telugu as a hub for Breaking News in Telugu Google News in Telugu Hyderabad industries Latest News in Telugu manufacturing fighter jets Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.