📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Missiles: హైదరాబాద్ మరో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్

Author Icon By Vanipushpa
Updated: June 20, 2025 • 5:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గడచిన కొన్నేళ్లుగా దేశ రక్షణ వ్యవస్థను బలోపేతంపై భారత్ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థను విస్తరించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత బ్రహ్మోస్ క్షిపణుల(Brahmos Missile) ఉత్పత్తిని పెద్ద ఎత్తున పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్(Hyderabad) లోని బాలాపూర్(Balapur) లో ఈ క్షిపణుల తయారీ యూనిట్ నెలకొల్పబడి ఉంది. దీన్ని విస్తరించాలనే ప్రణాళికలో భాగంగా స్థలాల కోసం అన్వేషణ సాగుతోంది. అయితే ఈ నెల 18న హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డితో బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ ప్రతినిధులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో బ్రహ్మోస్ ఏరోస్పేస్ విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతినిధులను కోరారు. డిఫెన్స్ కారిడార్ ను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాలు అనుకూలమైనవన్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో పలు డిఫెన్స్ సంస్థలున్న నేపథ్యంలో బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థను సైతం విస్తరించాలని కోరారు.

Missiles: హైదరాబాద్ మరో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్

బస్వాయిపల్లి గ్రామ శివారులోని భూముల పరిశీలించారు
అలా సమావేశం ముగిసి మూడు రోజులు గడవకు ముందే బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో స్థల పరిశీలన చేపట్టారు. DRDL జనరల్ ఆఫ్ బ్రహ్మోస్ డైరెక్టర్ డా, జైతీర్థ్ జోషి, DRDL డైరెక్టర్ డా,జీ.ఏ శ్రీనివాస్ మూర్తి, బ్రహ్మోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా, జీ. ఎ.ఎస్ సాంబశివప్రసాద్ మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని చౌదర్ పల్లి, బస్వాయిపల్లి గ్రామ శివారులోని భూముల పరిశీలించారు. వీరికి తోడుగా స్థానిక ఎమ్మెల్యే జీ మధుసూధన్ రెడ్డి సైతం భూముల పరిశీలనలో పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో సుమారు 400 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్, అనుబంధ సంస్థలకు అనుకూలంగా ఉంటుందని భావించారు.
బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్ ఏర్పాటు
ఇక తాజా స్థల పరిశీలనతో హైదరాబాద్ – బెంగళూరు డిఫెన్స్ కారిడార్ మళ్ళీ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం స్థల పరిశీలన జరిగిన ప్రాంతంలో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్ ఏర్పాటు జరిగితే డిఫెన్స్ కారిడార్ కు వేగంగా అడుగులు పడే అవకాశం ఉంది. మిస్సైల్ తయారీ యూనిట్ ఏర్పాటైతే ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. మిస్సైల్ కు అవసరమయ్యే విడిభాగాలు తయారీకి సంబంధిత MSME పరిశ్రమలు అవసరం ఉంటుంది. ఇక బ్రహ్మోస్ క్షిపణిని భారత బ్రహ్మాస్త్ర గా భావిస్తారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్షిపణుల్లో బ్రహ్మోస్ ఒకటి. తక్కువ ఎత్తులో ఎగురుతూ శత్రువుల యాంటీ మిస్సైల్ సిస్టమ్ లకు దొరక్కుండా దూసుకుపోతాయి.

Read Also: Rivers: ప్రపంచంలో అతి పొడవైన నదులు ఏవో తెలుసా?

#telugu News Ap News in Telugu brahmos missile Breaking News in Telugu Google News in Telugu hyderabad Latest News in Telugu manufacturing unit Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.