హనీమూన్ మర్డర్ కేసు: సంజయ్ వర్మ ఎవరు? సంచలనం రేపుతున్న కొత్త విషయాలు!
Honeymoon Murder: కేసులో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. రాజా రఘువంశీ హత్య కేసు దర్యాప్తు జరుగుతున్న కొద్దీ అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇటీవల సంజయ్ వర్మ అనే కొత్త పేరు తెరపైకి రావడంతో, అసలు అతనెవరు, అతనికి ఈ కేసుతో సంబంధం ఏంటి అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. సోనమ్(Sonam) అతనికి ఏకంగా 234 సార్లు ఎందుకు కాల్ చేసిందనే సందేహాలు రేగాయి. ఈ ప్రశ్నలన్నింటికీ మేఘాలయ పోలీసులు ఇప్పుడు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. సోనమ్ ఫోన్ నుండి లభించిన కాల్ డేటా ఆధారంగా, పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు.
సంజయ్ వర్మ మరెవరో కాదు.. రాజ్ కుష్వాహానే!
సోనమ్‌కు సంజయ్ వర్మతో ఉన్న సంబంధంపై నెలకొన్న ఊహాగానాలకు తెరదించుతూ, పోలీసులు ఆ వ్యక్తి మరెవరో కాదని, రాజా రఘువంశీ హత్యకు పథకం వేసిన సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహానే అని స్పష్టం చేశారు. హత్య పథకంలో భాగంగా ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు సోనమ్(Sonam), రాజ్ నంబర్‌ను తన ఫోన్‌లో ‘సంజయ్ వర్మ’ పేరుతో సేవ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం బయటపడటంతో కేసులో మరో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది.
234 కాల్స్.. గంటల తరబడి సంభాషణలు!
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, సోనమ్ తన పెళ్లికి ముందు కేవలం 39 రోజుల వ్యవధిలో రాజ్ కుష్వాహాకు (సంజయ్ వర్మగా సేవ్ చేయబడిన నంబర్‌కు) ఏకంగా 234 సార్లు కాల్ చేసిందట. అంతేకాదు, ప్రతిరోజూ కనీసం నాలుగు నుంచి ఐదుసార్లు, ఒక్కో కాల్ 30 నుంచి 60 నిమిషాల పాటు మాట్లాడుకున్నట్లు కాల్ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఈ కాల్ డేటా ఆధారంగా, రాజా రఘువంశీ హత్య ఒక పథకం ప్రకారం జరిగిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
హనీమూన్ మర్డర్: కీలక అరెస్టులు, దర్యాప్తు పురోగతి
రాజా రఘువంశీ, సోనమ్ వివాహం మే 11న జరగగా, సరిగ్గా నెలరోజులకు, అంటే జూన్ 11న, సోనమ్ తన భర్తను హత్య చేసినట్లు అంగీకరించింది. ఈ కేసులో సోనమ్‌తో పాటు, ఆమెకు సహకరించిన మరో నలుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. సంజయ్ వర్మ అనే పేరుతో వెలుగులోకి వచ్చిన రాజ్ కుష్వాహా గురించి తెలిసిన తర్వాత, దర్యాప్తు మరింత వేగవంతమైంది. ఈ హనీమూన్ మర్డర్ కేసులో ఇంకా ఎన్ని కొత్త విషయాలు బయటపడతాయో చూడాలి.
Read also: wedding : పెళ్లి కుమార్తెతో పారిపోయిన పెళ్లి కొడుకు తండ్రి !